Eid Al Fitr 2022: యూఏఈలో ఐదు రోజుల లాంగ్ వీకెండ్!

ABN , First Publish Date - 2022-04-16T16:35:37+05:30 IST

ఈసారి ఈద్ అల్ ఫితర్‌ సందర్భంగా యూఏఈ వాసులకు ఏకంగా ఐదు రోజుల లాంగ్ వీకెండ్ వస్తోంది.

Eid Al Fitr 2022: యూఏఈలో ఐదు రోజుల లాంగ్ వీకెండ్!

దుబాయ్: ఈసారి ఈద్ అల్ ఫితర్‌ సందర్భంగా యూఏఈ వాసులకు ఏకంగా ఐదు రోజుల లాంగ్ వీకెండ్ వస్తోంది. ఎమిరేట్స్ ఆస్ట్రోనామికల్ సొసైటీ (ఈఏఎస్) అంచనా ప్రకారం రంజాన్ పండుగ మే 2న ఉండనుంది. దీంతో ఏప్రిల్ 30 నుంచి మే 4 వరకు వరుసగా ఐదు రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈఏఎస్ బోర్డు ఛైర్మన్ ఇబ్రహీం అల్ జర్వాన్ మాట్లాడుతూ, ఇస్లామిక్ క్యాలెండర్‌లో షవ్వాల్ మొదటి రోజు (ఇది ఈద్ అల్ ఫితర్ మొదటి రోజు కూడా) మే 2, 2022 సోమవారం వస్తుందని అంచనా వేయబడిందని తెలిపారు. ఇక 2022 కోసం యూఏఈ ఆమోదించిన క్యాలెండర్ ప్రకారం ఈద్ అల్ ఫితర్ సెలవుదినం శనివారం (ఏప్రిల్ 30 2022) ప్రారంభమై.. మే 3 (మంగళవారం) లేదా మే 4 (బుధవారం) ముగుస్తుంది. దాంతో యూఏఈ నివాసితులు శనివారం (ఏప్రిల్ 30), ఆదివారం (మే 1), సోమవారం (మే 2), మంగళవారం(మే 3), బుధవారం (మే 4) వరుసగా ఐదు రోజుల వారాంతాన్ని ఆనందిస్తారు. అయితే, ఇది చంద్రవంక కనిపించే దానిపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-16T16:35:37+05:30 IST