నల్లగొండలో ఎనిమిది టేకు దుంగలు పట్టివేత

ABN , First Publish Date - 2022-07-01T06:34:47+05:30 IST

స్థానిక అటవీరేంజ్‌ పరిధిలోని నల్లగొండ గ్రామంలో ఎనిమిది టేకు దుంగలు సాధీనపర్చుకున్నట్టు గొలుగొండ సెక్షన్‌ అధికారి లక్ష్మణ్‌ తెలిపారు.

నల్లగొండలో ఎనిమిది టేకు దుంగలు పట్టివేత
పట్టుబడిన టేకు దుంగలతో అటవీఅధికారులు



కృష్ణాదేవిపేట, జూన్‌ 30 : స్థానిక అటవీరేంజ్‌ పరిధిలోని నల్లగొండ గ్రామంలో ఎనిమిది టేకు దుంగలు సాధీనపర్చుకున్నట్టు గొలుగొండ సెక్షన్‌ అధికారి లక్ష్మణ్‌ తెలిపారు. వివరాలిలా వున్నాయి. కొప్పుకొండ-నల్లగొండ అటవీ ప్లాంటేషన్‌లో 22 టేకు చెట్లు మాయం కావడంతో స్థానిక డీఆర్‌వో కె.వెంకటరమణ, గార్డు నూకరాజులను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపఽథ్యంలో ఇప్పటికే 91 టేకు దుంగలు ప్లయింగ్‌ స్క్వాడ్‌ డీఎఫ్‌వో సోమసుందర్‌, కృష్ణాదేవిపేట అధికారులు స్వాధీనపర్చుకోగా.. గురువారం సాయంత్రం నల్లగొండలో మరో ఎనిమిది టేకు దుంగలు గుర్తించారు. దీంతో 22 టేకు చెట్లకు చెందిన దుంగలను పూర్తిస్థాయిలో తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. గురువారం నాడు ఎనిమిది టేకు దుంగలను సెక్షన్‌ అధికారి లక్ష్మణ్‌, గార్డులు మహంతి, బంగారయ్య, రాకేష్‌కుమార్‌, దుర్గాప్రసాద్‌ పట్టుకున్నారు. వీటిని ట్రాక్టర్‌పై గొలుగొండ కలప డిపోకు తరలించినట్టు తెలిపారు. 

Updated Date - 2022-07-01T06:34:47+05:30 IST