
లక్నో(ఉత్తరప్రదేశ్): ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సతీష్ మహానా యూపీ అసెంబ్లీకి కొత్త స్పీకర్గా అయ్యే అవకాశం ఉందని అధికార బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి కొత్త స్పీకర్గా బీజేపీ నేత, యూపీ కేబినెట్ మాజీ మంత్రి సతీష్ మహానా ఎంపికయ్యే అవకాశం ఉందని సమాచారం.శుక్రవారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొత్త మంత్రివర్గంలో సతీష్ మహానాకు మంత్రి పదవి ఇవ్వలేదు.
శనివారం ప్రొటెం స్పీకర్ రమాపతి శాస్త్రితో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రమాణం చేయిస్తారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మార్చి 28,29 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఆ తర్వాత మార్చి 30వతేదీన యూపీ అసెంబ్లీలో కొత్త స్పీకర్గా సతీష్ మహానాను ప్రకటించవచ్చు.యోగి ఆదిత్యనాథ్ తొలి కేబినెట్లో సతీష్ మహానా పారిశ్రామిక అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.
ఇవి కూడా చదవండి