దక్షిణ నైజర్‌లో goldmine కూలి 18 మంది దుర్మరణం

Published: Tue, 09 Nov 2021 07:29:44 ISTfb-iconwhatsapp-icontwitter-icon
దక్షిణ నైజర్‌లో goldmine కూలి 18 మంది దుర్మరణం

నియామీ : నైజీరియా సరిహద్దుకు సమీపంలోని దక్షిణ నైజర్‌లో ఆర్టిసానల్ గోల్డ్‌మైన్ కూలిపోవడంతో 18 మంది మరణించారని స్థానిక మేయర్ తెలిపారు.కూలిన బంగారపు గనిలో నుంచి మృతదేహాలను వెలికితీసి ఖననం చేశామని  డాన్-ఇస్సా జిల్లా మేయర్ అడమౌ గురౌ చెప్పారు. ఈ దుర్ఘటనలో ఏడుగురు నైజీరియన్ పౌరులు తీవ్రంగా గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్పారు.

గ్యారిన్-లిమాన్ బంగారు గని స్థలంలో ఆర్టిసానల్ బావులు కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.సహాయ చర్యలు కొనసాగుతున్నాయని గుంటల అడుగున ఇంకా మృతదేహాలు చిక్కుకొని ఉండవచ్చని స్థానికులు చెప్పారు.గ్యారిన్-లిమాన్ బంగారు గనులు కొన్ని నెలల క్రితమే కనుగొన్నారు.దీంతో వేలాది మంది మైనర్లు ఆ ప్రాంతానికి తరలి వచ్చి బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.