Madras ఐఐటీలో మరో 18 మంది విద్యార్థులకు కొవిడ్

ABN , First Publish Date - 2022-04-22T18:07:33+05:30 IST

తమిళనాడు రాష్ట్రంలోని మద్రాస్ ఐఐటీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం మరో 18 మంది ఐఐటీ విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది...

Madras ఐఐటీలో మరో 18 మంది విద్యార్థులకు కొవిడ్

చెన్నై(తమిళనాడు): తమిళనాడు రాష్ట్రంలోని మద్రాస్ ఐఐటీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం మరో 18 మంది ఐఐటీ విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. గురువారం మద్రాస్ ఐఐటీలో 12మంది విద్యార్థులకు కరోనా సోకిందని తేలింది. మళ్లీ శుక్రవార పరీక్షలు చేయగా మరో 18 మందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది.ఐఐటీ క్యాంపస్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30కి పెరిగింది. ఐఐటీ హాస్టల్ లోనే కరోనా వ్యాప్తి చెందటంతో ఐఐటీ పరిపాలనాధికారులు, వైద్యాధికారులు పారిశుద్ధం మెరుగుపై దృష్టి సారించారు.ఐఐటీలో కరోనా సోకిన వారిలో 90 శాతం మందికి ఒమైక్రాన్ బీఏ 2 వేరియెంట్ అని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ చెప్పారు.శుక్రవారం ఒక్కరోజే దేశంలో 2,451 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో ప్రస్థుతం ఉన్న యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 14,241కి చేరింది. 


Updated Date - 2022-04-22T18:07:33+05:30 IST