Srinagar వైద్యకళాశాలలో 80 మంది వైద్యులకు కొవిడ్ పాజిటివ్

ABN , First Publish Date - 2022-01-19T13:56:52+05:30 IST

జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 80 మంది వైద్యులు, పారామెడికల్ ఉద్యోగులు, ఎంబీబీఎస్ విద్యార్థులు కరోనా బారిన పడ్డారు...

Srinagar వైద్యకళాశాలలో 80 మంది వైద్యులకు కొవిడ్ పాజిటివ్

శ్రీనగర్: జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 80 మంది వైద్యులు, పారామెడికల్ ఉద్యోగులు, ఎంబీబీఎస్ విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. మంగళవారం ఒక్కరోజే వైద్యకళాశాలలో 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరం రేపింది. కశ్మీరులోని వైద్యకళాశాలలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 546కు పెరిగాయి.46 మంది డాక్టర్లు, 22 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 15 మంది పారామెడికల్ ఉద్యోగులకు కరోనా సోకిందని కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సలీంఖాన్ చెప్పారు. కరోనా కేసుల వ్యాప్తి కారణంగా ప్రజలందరూ ఫేస్ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని వైద్యులు సూచించారు. 


మంగళవారం ఒక్కరోజే జమ్మూ డివిజన్ లో 3,105, కశ్మీరులో 1546 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.జమ్మూకశ్మీరులో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 21,677కు పెరిగింది. కరోనాతో ముగ్గురు మరణించారు. కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ఎస్కేఐఎంఎస్ వైద్యకళాశాల, శ్రీనగర్ లోని బెమీనా హాస్పిటల్, బారాముల్లా సబ్ జిల్లా హాస్పటల్, కశ్మీర్ ఛాతీవ్యాధుల ఆసుపత్రులను కరోనా చికిత్సకు కేటాయించారు.


Updated Date - 2022-01-19T13:56:52+05:30 IST