Mussoorie నేషనల్ అకాడమీలో 84 మంది ఐఎఎస్ ట్రైనీలకు కరోనా

ABN , First Publish Date - 2022-01-19T17:03:51+05:30 IST

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరి నగరంలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో కరోనా కలకలం ఏర్పడింది....

Mussoorie నేషనల్ అకాడమీలో 84 మంది ఐఎఎస్ ట్రైనీలకు కరోనా

ముస్సోరి: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరి నగరంలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో కరోనా కలకలం ఏర్పడింది. ఈ జాతీయ అకాడమీలో 84 మంది ఐఎఎస్ ట్రైనీలు, అధ్యాపకులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. 84 మందికి కరోనా సోకడంతో ముస్సోరి అకాడమీని కొవిడ్ కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.కొవిడ్ సోకిన ట్రైనీలు, అధ్యాపకులను ముస్సోరి అకాడమీలోనే క్వారంటైన్ చేశారు.అకాడమీలో ట్రైనీలందరికీ కరోనా పరీక్షలు చేశారు. గడచిన 24 గంటల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 4,482 మందికి కరోనా సోకింది. కరోనా వల్ల ఆరుగురు మరణించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 20,620 కు పెరిగింది. ముస్సోరి అకాడమీలో కరోనా వ్యాప్తికి కారణాలపై వైద్యుల బృందం ఆరా తీస్తోంది. వైద్యబృందాలను అకాడమీకి రప్పించారు.


Updated Date - 2022-01-19T17:03:51+05:30 IST