
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం హస్తినకు చేరింది. తనకు, తన వర్గం ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ అచ్చిన అనర్హత నోటీసు (Disqualifcation notice)ను సవాలు చేస్తూ శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) సుప్రీంకోర్టు (Supreme court)ను ఆదివారంనాడు ఆశ్రయించారు. శివసేన లెజిస్లేచర్ పార్టీ నేతగా తన స్థానంలో అజయ్ చౌదరిని నియమించడాన్ని కూడా షిండే సవాలు చేశారు. దీనిపై ఈనెల 27వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటలకు అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
థాకరేకు మద్దతుగా ఢిల్లీలో శివసైనికుల నిరసన
కాగా, శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు మద్దతుగా ఆ పార్టీ ఢిల్లీ విభాగం కార్యకర్తలు మద్దతు ప్రకటించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్టీని బలహీనపరచాలనుకుంటున్న వారు (రెబల్స్) బాలాసాహెబ్ సిద్ధాంతాలను కట్టుబడిన వారు కాదని, ఉద్ధవ్ థాకరే వెన్నంటే తాము ఉంటామని, అధికార దాహం కోసం శివసేనను బలహీనపరచే వారికి గట్టి గుణపాఠం చెబుతామని శివసేన ఢిల్లీ విభాగం ఇన్‌చార్జి ఎం.ముండే తెలిపారు.