ఘోరమైన తప్పు ఇది: ఏక్తా కపూర్‌

Jun 6 2021 @ 19:38PM

మైనర్‌ బాలికపై అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటుడు పరల్‌ వీ పూరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆరోపణల్లో నిజం లేదని బాలిక తల్లి వాదిస్తోంది. పరల్‌ను అక్రమంగా కేసులో ఇరికించారంటూ హిందీ బుల్లితెర అతనికి సపోర్ట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో నిర్మాత ఏక్తా కపూర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓ బాలిక మీద అత్యాచారం చేసిన వాడికి నేను మద్దతిస్తానా? లైంగిక వేధింపులకు గురి చేేసవారికి అండగా నిలుస్తానా? కానీ నిన్నరాత్రి నుంచి నాకు ఎదురైన పరిస్థితులు చూస్తుంటే మానవత్వం మంటగలిసినట్లు అనిపిస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న   గొడవలోకి మూడో వ్యక్తిని అన్యాయంగా లాగుతారా? ఓ మనిషి సాటి మనిషి మీద అలా ఎలా చేయగలడు? ఆ బాలిక తల్లితో చాలాసార్లు మాట్లాడాను. పరల్‌ అమాయకుడని, అతనికి ఈ గొడవతో సంబంధం లేదని ఆమె స్పష్టంగా చెప్పింది.  తన భర్తే కావాలని పరల్‌ని ఇరికిస్తున్నాడని స్వయంగా వెల్లడించింది. సెట్‌లో పని చేేస మహిళలు పిల్లలను సరిగా చూసుకోలేరని నిరూపించేందుకు ఇదంతా చేస్తున్నాడనీ ఆమె తెలిపింది. ఇదే నిజమైతే ఘోరమైన తప్పు ఇది. ‘మీటూ’ను అడ్డుపెట్టుకుని స్వప్రయోజనాల కోసం ఓ చిన్నారిని మానసికంగా హింసిస్తూ ఓ అమాయక వ్యక్తిని దోషిగా నిలబెట్టాలనుకోవడం దారుణమైన చర్య. ఈ ఘటనలో తప్పోప్పులు ఎవరివి అనేది తేల్చే హక్కు నాకు లేదు. న్యాయస్థానమే దానికి జవాబు చెబుతుంది. కానీ బాలిక తల్లి చెప్పినదాని ప్రకారం పరల్‌ అమాయకుడని స్పష్టమవుతోంది’’ అని ఏక్తాకపూర్‌ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. 



Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.