వయోవృద్ధులను ప్రేమతో ఆదరించాలి

ABN , First Publish Date - 2022-10-02T05:40:08+05:30 IST

వయోవృద్ధులను ప్రేమతో ఆదరించాలని అదన పు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు.

వయోవృద్ధులను ప్రేమతో ఆదరించాలి
వయోవృద్ధులను సన్మానిస్తున్న అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

- అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ 

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు 1 : వయోవృద్ధులను ప్రేమతో ఆదరించాలని అదన పు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, కుమార్‌దీపక్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగ అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వయోవృద్ధులపై ప్రేమ తో బాధ్యతాయుతంగా, గౌరవంగా మెలగాలన్నారు. వయోవృద్దుల సమస్యల పరి ష్కారం కోసం ప్రభుత్వం 14567 టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటుచేసిందని, ఈ సదుపా యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూవో రవూ ఫ్‌ఖాన్‌, సీనియర్‌ సిటిజన్‌ కమిటీ సభ్యులు చంద్రమౌళి, స్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-02T05:40:08+05:30 IST