Viral Video: రష్యా సైనికులతో వృద్ధుల వాదన.. తుపాకి శబ్దానికి బెదరలేదు.. వాళ్లు చేసిన పనికి America సెల్యూట్

ABN , First Publish Date - 2022-03-13T02:37:19+05:30 IST

ఉక్రెయిన్‌పై గత నెల 24న యుద్ధానికి దిగిన రష్యా.. ఆ దేశాన్ని హస్తగతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో లక్షల మంది ఉక్రెయిన్ పరువులు దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. మరికొం

Viral Video: రష్యా సైనికులతో వృద్ధుల వాదన.. తుపాకి శబ్దానికి బెదరలేదు.. వాళ్లు చేసిన పనికి America సెల్యూట్

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌పై గత నెల 24న యుద్ధానికి దిగిన రష్యా.. ఆ దేశాన్ని హస్తగతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. మరికొందరేమో రష్యాను ఎదురుకునేందుకు రణరంగంలోకి దూకుతున్నారు. ఈ క్రమంలో వృద్ధ దంపతులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వాళ్ల ధైర్యానికి అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



రష్యా దాడి చేస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌కు చెందిన వృద్ధ దంపతులు తమ దేశంలోనే ఉండిపోయారు. ఈ జంట ఇంట్లో ఉండగానే.. గేటు తీసుకుని ముగ్గురు రష్యా సైనికులు తమ ఇంటి ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. బయట అలికిడి కావడంతో దంపతులు ఇద్దరూ బయటికొచ్చారు. రష్యా సైనికులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇంటి పరిసరాల నుంచి వెళ్లిపొండని కేకలు వేశారు. ఈ నేపథ్యంలో ఓ సైనికుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. అయినా ఆ దంపతులు బెదరలేదు. సైనికులు తమ ఇంటిని వీడే వరకూ వారిని వదల్లేదు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తాజాగా ఈ వీడియోను ఉక్రెయిన్‌లోని అమెరికా ఎంబసీ కార్యాలయం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. వృద్ధుల ధైర్యానికి సెల్యూట్ చెప్పింది. 






Updated Date - 2022-03-13T02:37:19+05:30 IST