
అరవయ్యేళ్లు పైబడిన ఓ వృద్ధుడిని కొందరు మహిళలు ఓ స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు.. అతడి బట్టలు చించేసి ఇష్టమొచ్చినట్టు కొట్టారు.. స్థానికులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.. ఆ వృద్ధుడు బాగా మద్యం సేవించి ఓ మహిళను వేధించాడనే కారణంతో స్త్రీలందరూ కలిసి అతడిపై దాడి చేశారు.. బీహార్ రాజధాని పాట్నాకు సమీపంలో ఉన్న దానాపూర్‌లో ఈ ఘటన జరిగింది.
దానాపూర్ డయారాలోని ఓ వృద్ధుడిని అతడి ఇంటి ముందే స్తంభానికి తాడుతో కట్టేశారు. ఆ తర్వాత అతడి బట్టలు చించేసి బాగా కొట్టారు. అతడిని కొట్టిన వారిలో అందరూ మహిళలే ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న ఆ వృద్ధుడు తమపై వేధింపులకు పాల్పడ్డాడని మహిళలు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో మహిళలు అతడిని కర్రలతో కొట్టడం కనిపిస్తోంది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసు బృందం గంగారా గ్రామానికి వెళ్లి విచారించింది. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవి కూడా చదవండి