కతర్‌ వదిలి, కేరళలో కలువల తోట... స్ఫూర్తినిస్తున్న యువకుడు!

ABN , First Publish Date - 2020-12-02T15:13:17+05:30 IST

‘నేను కతర్‌లో పదేళ్ల పాటు ఉద్యోగం చేశాను. వృత్తిరీత్యా నేను మేల్ నర్స్‌ను. లక్ష రూపాయల జీతం వచ్చేది. అయితే ఉద్యోగం కోసం కుటుంబ సభ్యులకు...

కతర్‌ వదిలి, కేరళలో కలువల తోట... స్ఫూర్తినిస్తున్న యువకుడు!

తిరువనంతపురం: ‘నేను కతర్‌లో పదేళ్ల పాటు ఉద్యోగం చేశాను. వృత్తిరీత్యా నేను మేల్ నర్స్‌ను. లక్ష రూపాయల జీతం వచ్చేది. అయితే ఉద్యోగం కోసం కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఫ్యామిలీని చాలా మిస్ అయ్యేవాడిని. అందుకే కేరళకు వచ్చేసి, కలువల తోటను ప్రారంభించాను’.. అని ఎల్డ్‌హోస్ పీ రాజు తెలిపారు. రాజు గత 9 నెలలుగా కలువల తోటను పెంచుతూ, ప్రతీనెలా 30 నుంచి 30 వేల రూపాయలు సంపాదిస్తున్నారు.


ఇప్పడు రాజు తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. తాను కలువపూల తోట సాగుచేయడానికి గల కారణాలను తెలియజేశారు. ‘నేను కేరళకు చెందినవాడిని. ఎర్నాకులంలో నర్సింగ్ శిక్షణ పూర్తి చేశాను. అయితే ఉన్న ఊరిలో ఉద్యోగం దొరకలేదు. దీంతో ముంబై బాటపట్టాను. అక్కడ ఒక ఆసుపత్రిలో మూడేళ్లు పనిచేశాను. అక్కడ కతర్‌లో ఉద్యోగం కోసం నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ‌కు హాజరయ్యాను. తరువాత కతర్ వెళ్లాను. మంచి జీతం వస్తుండటంతో, అక్కడే కొంతకాలం ఉద్యోగం చేశాను. అయితే కుటుంబానికి దూరంగా ఉండాల్సిరావడం బాధగా అనిపించేది. కుటుంబ సభ్యులను చూసేందుకు తరచూ కేరళ రావడం సాధ్యమయ్యే పనికాదు. దీంతో అక్కడ ఉండలేక, ఉద్యోగం వదిలేసి, 2019లో కేరళ వచ్చేశాను. అయితే మంచి ఉద్యోగాన్ని వదిలివేశాక, ఇంకో ఉద్యోగం దొరుకుతుందా? అనే భయం పట్టుకుంది. 


అయితే నేను భయపడిన విధంగా ఏమీ జరగలేదు. నాకు గార్డెనింగ్‌పై ఎంతో ఇష్టం ఉండటంతో, వివిధ రకాల కలువపూల మొక్కలను పెంచాలని నిర్ణయించుకున్నాను. మా ఇంటి మేడమీదనే కలువపూల తోటను ప్రారంభించాను. 40 రకాలకు మించిన కలువ పూల మొక్కలను పెంచాను. కలువపూల తోటను పెంచేందుకు యూట్యూబ్ సహాయం తీసుకున్నాను. నా వ్యాపారం గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేశాను. దీంతో విదేశాలకు కూడా పూలను విక్రయించే అవకాశం దొరికింది. కలువ పూల వ్యాపారంతో ఇప్పుడు నెలకు 30 వేల నుంచి 35 వేల వరకూ ఆదాయాన్ని సంపాదిస్తున్నాను. ఇప్పుడు ఎంతో సంతృప్తిగా ఉందని రాజు తెలిపారు. 

Updated Date - 2020-12-02T15:13:17+05:30 IST