ఎన్నికల కూలీలు

ABN , First Publish Date - 2021-03-06T06:18:34+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికల ప్రచా రాలు ఊపందుకున్నాయి. మున్సి పాల్టీల్లో కౌన్సిలర్లు, గుంటూరు నగర పాలక సంస్థలో కార్పొరేటర్‌ అభ్యర్థులు ప్రచారాల ను ముమ్మ రం చేశారు.

ఎన్నికల కూలీలు

పనులు మానిప్రచారాలకు మొగ్గు

అల్పాహారం, భోజనం ఖర్చులు అభ్యర్థులవే..

రోజుకు 300 నుంచి 500 వరకు నగదు చెల్లింపు

10 మందిని తీసుకొస్తే అదనపు మొత్తం అందజేత


గుంటూరు, మార్చి 5 (ఆంధ్ర జ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల ప్రచా రాలు ఊపందుకున్నాయి. మున్సి పాల్టీల్లో కౌన్సిలర్లు, గుంటూరు నగర పాలక సంస్థలో కార్పొరేటర్‌ అభ్యర్థులు ప్రచారాల ను ముమ్మ రం చేశారు. ఎన్నికల ప్రచారం పరి సమాప్తం కావడానికి మరో వారం వ్యవధి ఉన్న నేపథ్యంలో ఇంటిం టి ప్రచారాలు, ర్యాలీలు నిర్వహి స్తున్నారు.  ఓటర్లను ఆకర్షించేం దుకు డీజే, బ్యాండ్‌ బాజాలతో నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ఓటర్లను తమకు మద్దతు ఇవ్వాలని  అభ్యర్థిస్తున్నారు. ఇందుకోసం చాలామంది అభ్యర్థులు అద్దె మనుషులను వెంట తెచ్చుకుంటున్నారు. ఏ రోజుకు ఆ రోజు నగదు చెల్లిస్తుండటంతో వా రు తమ పనులు మానేసి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. వీరికి నగదుతో పాటు అల్పాహారం, భోజనం వంటి ఖర్చులు కూడా అభ్యర్థులే చూసుకుంటున్నారు. కొద్ది రోజుల నుంచి నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో కొంతమంది మహిళలకు పార్టీ జెండాలు చేతికి ఇచ్చి ఇంటింటి ప్రచా రంలో తమ వెంట తీసుకెళుతున్నారు.  కొంతమంది అభ్యర్థులు అయితే పదేళ్ల పిల్లలను కూడా ప్రచారాలకు వెంట తీసుకెళుతున్నారు. యువకులకు అయితే రోజుకు రెండు లీటర్ల పెట్రోలు, తిండి ఖర్చులు ఇస్తున్నారు. మహి ళలకు మాత్రం నగదు చేతిలో పెడుతున్నారు. పది మంది మహిళలను ప్రచారానికి తీసుకొస్తే వారి నాయకురాలికి అదనంగా కూడా ఆఫర్‌ చేసు ్తన్నారు. అభ్యర్థి ఆర్థిక స్థోమతని బట్టి రోజుకు రూ.300 నుంచి రూ.500 వర కు చెల్లిస్తున్నారు. గుంటూరు నగరంలో అయితే ఎన్నికల ప్రచారంలో వింత పోకడలను అవలంభిస్తున్నారు. భారీ వాహనాల్లో డీజే సెట్లు పెట్టి డ్యాన్స్‌లు, బంజార కళాకారులతో నృత్యాలు చేయిస్తున్నారు. సినీ తారలు, రాజకీయ నా యకులు డూప్‌లను తీసుకొచ్చి హావభావాలు ప్రదర్శింప చేస్తున్నారు. వీరికి పెద్దమొత్తంలోనే నగదు చెల్లిస్తున్నారు. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త పోకడలతో ర్యాలీలు, ప్రచారం నిర్వహించేందుకు అభ్యర్థులు ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. 



Updated Date - 2021-03-06T06:18:34+05:30 IST