ఇక్కడ ఎన్నికల్లేవు !

ABN , First Publish Date - 2021-01-24T06:37:21+05:30 IST

ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడంతో అంతటా ఎన్నికల సందడి మొదలైంది. కానీ ఆ 31 పంచాయతీల్లో మాత్రం సందడి ఉం డదు.

ఇక్కడ ఎన్నికల్లేవు !

31 పంచాయతీలకు ఎన్నికలు నిల్‌

వాటిలో రాజమహేంద్రవరంలో 21, కాకినాడలో 6, తునిలో 4 

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడంతో అంతటా ఎన్నికల సందడి మొదలైంది. కానీ ఆ 31 పంచాయతీల్లో మాత్రం సందడి ఉం డదు. ఎందుకంటే వాటికి ఎన్నికలు జరగ డంలేదు. రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో గతంలో 21 పంచాయతీలను విలీన ప్రతిపాదన చేశారు. అందులో రాజ మహేంద్రవరం రూరల్‌ మండలంలో 10, కడియంలో 1, రాజానగరంలో 6, కోరుకొండ మండలంలో 4, కాకినాడ రూరల్‌ మండ లంలో 6, తుని రూరల్‌ మండలంలోని 4 గ్రామ పంచాయతీలను ఆయా మున్సిపాల్టీ లలో కలపాలని ప్రతిపాదించారు. కానీ ఇటీ వల గవర్నర్‌ కేవలం  రాజమహేంద్రవరం లోని 9 గ్రామ పంచాయతీలు, కడియంలోని వేమగిరి పంచాయతీని మాత్రం విలీనం చేస్తూ ఆర్డినెన్స్‌ జారీచేశారు. అంతకు ముందు కోర్టు మిగతా పంచాయతీలను విలీనాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో విలీనమైన 10 గ్రామాలు మినహా మిగతా వాటికి ఎన్నికలు జరిగిపోతాయనే ఆలోచన తో ఆయా గ్రామాల ప్రజలు, ఆశావహులు ఉన్నారు. కానీ గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ ఆధారంగానే ఇవాళ ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంతో ఈ గ్రామాలకు ఎన్నికలు జరగవు. ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎన్నికలు ఇప్పుడు జరపవద్దంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఎన్నికలు ఆపవద్దని ఆదే శించినా, ఈ 31 గ్రామాలకు ఎన్నికలు జరగవు. అందులో రాజమహేంద్రవరం రూరల్‌లోని 9, కడియం మండలంలోని 1 గ్రామం విలీనం అయ్యాయి. కాబట్టి మిగతా వాటికి విలీన ప్రక్రియ లేనట్టయితే, ఎన్నికల కమిషన్‌ మళ్లీ వీటికి ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ ఇవ్వవలసి ఉంది. కానీ రాజమహేంద్రవరంలో మొత్తం 21 పంచాయతీలను విలీనం చేయాలని, చివరకు రూరల్‌ మండలంలోని 9, వేమగిరిని విలీనం చేయడం వల్ల మహానగరం కాదనే వాదనతో కోర్టుకెళ్లే ఆలోచన ఉంది. ఈనేపఽథ్యంలో అవి కూడా విలీనమైపోతే మున్సిపాల్టీలతో ఎన్నికలు జరుగుతాయి. విలీనం కాకపోతే ఎన్నికల కమిషన్‌ ప్రత్యేకంగా మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వవలసిందే. వాస్తవానికి గత ఎన్నికల ముందు సర్పంచ్‌, రిజ ర్వేషన్లు ఖరారయ్యాయి. వార్డుల విభజన జరగలేదు. ఈ పరిస్థితుల్లో ఈ పంచాయతీలలో ఎన్నికల జరగాలంటే మరికొంత సమయం పట్టకతప్పదు.

ఎన్నికలు లేని పంచాయతీలు..

రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలో 10 పంచాయతీలకు ఎన్నికలు ఉండవు. అందులో ధవళే శ్వరం, బొమ్మూరు, రాజవోలు, శాటిలైట్‌సిటీ, పిడింగొయ్యి, హుకుంపేట, కాతేరు, తొర్రేడు, కోలమూరు, వెంక టనగరం గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రాజానగరం మండలంలోని లాలాచెరువు, దివాన్‌చెరువు,  పాల చర్ల, వెలుగుబంద, చక్రద్వారబంధం, నామవరం పంచాయతీలకు ఎన్నికలు లేవు. కోరుకొండ మండలం పరిధిలోని బూరుగుపూడి, మధురపూడి, గాదరాడ, నిడిగట్ల పంచాయతీలకు కూడా ఎన్నికలు జరగవు. 

 కాకినాడ రూరల్‌లోని 6 గ్రామాలకు కూడా ఎన్నికలు జరగడంలేదు. వీటిని గతంలో కాకినాడ కార్పొ రేషన్‌లో విలీన ప్రతిపాదన చేశారు. ఇదింకా తేలలేదు. అందులో వలసపాకల, వాకలపూడి, రమణయ్య పేట, ఇంద్రపాలెం, చీడిగ, తూరంగి పంచాయతీలు ఉన్నాయి.

 తుని రూరల్‌లో నాలుగు పంచాయతీలకు ఎన్నికలు లేవు. వీటిని తుని మున్సిపాల్టీలోకి విలీన ప్రతి పాదన చేశారు. ఇదింకా పూర్తి కాలేదు. అవి కుమ్మరిలోవ, తాళ్లూరు, రేఖావానిపాలెం, ఎస్‌.అన్నవరం.



 

Updated Date - 2021-01-24T06:37:21+05:30 IST