చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడిగా పార్ధసారధి

ABN , First Publish Date - 2021-12-22T20:51:31+05:30 IST

రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కొంతమంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్లను ప్రత్యేక పరిశీలకులుగా ఆహ్వానించాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడిగా పార్ధసారధి

హైదరాబాద్: రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కొంతమంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్లను ప్రత్యేక పరిశీలకులుగా ఆహ్వానించాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ ఆహ్వనం మేరకు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పర్యవేక్షించడానికి ప్రత్యేక పరిశీలకుడిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారధి చండీగఢ్ ను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ,ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను గమనిస్తే, ఎస్ఈసీ అనుసరించే వినూత్న చర్యలు, ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి సహాయపడుతుందని అన్నారు.అలాగే స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడం, ఇతర రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణకు ఈ ఎన్నికలు ఉపయోగపడుతాయన్నారు.


గతంలో ఏపీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, మిజోరం మొదలైన వివిధ ఎస్ఈసీలు ఈ పద్ధతిని అనుసరించాయని అన్నారు. ప్రస్తుతం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి.  ఈనెల20వ తేదీ నుండి 25వ తేదీ వరకు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ ఎన్నికలను పర్యవేక్షించడానికి ప్రత్యేక పరిశీలకునిగా చండిగడ్ లో పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక గెస్ట్ హౌస్ లో సంబంధిత జిల్లా కలెక్టర్ వినయ్ ప్రతాప్ సింగ్ మర్యాదపూర్వకంగా పార్థసారధిని కలిశారు. అనంతరం వివిధ రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల బృందంతో పార్థసారధి చండీగఢ్‌, డిల్లీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ ను కలుసుకున్నారు. 

Updated Date - 2021-12-22T20:51:31+05:30 IST