ఎన్నికల ర్యాలీలపై నిషేధం పొడిగించిన ఈసీ

ABN , First Publish Date - 2022-01-15T23:17:53+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలు, రోడ్‍‌షోలపై విధించిన నిషేధాన్ని..

ఎన్నికల ర్యాలీలపై నిషేధం పొడిగించిన ఈసీ

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలు, రోడ్‍‌షోలపై విధించిన నిషేధాన్ని ఈనెల 22వ తేదీ వరకూ ఎన్నికల కమిషన్ పొడిగించింది. దీనికి ముందు విధించిన నిషేధం శనివారంతో ముగియడంతో ఈసీ ఈ గడవును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  ఫిజికల్ ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం జనవరి 22 వరకూ పొడిగిస్తున్నట్టు చెప్పింది. అయితే, రాజకీయ పార్టీలు ఇండోర్ మీటింగ్స్‌లో 300 మంది లేదా సీట్ల సామర్థ్యంలో 50 శాతం మంది పాల్గొనేందుకు ఈసీ అనుమతించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) నిబంధనలను, కోవిడ్ మార్గదర్శకాలను అన్ని రాజకీయ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఎంసీసీ, కోవిడ్‌కు సంబంధించిన ఆదేశాలన్నీ సక్రమంగా అమలు జరిగేలా చూడాలని రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలను ఈసీ ఆదేశించింది.

Updated Date - 2022-01-15T23:17:53+05:30 IST