ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన Election Commission

ABN , First Publish Date - 2022-05-26T18:08:19+05:30 IST

న్యూఢిల్లీ: 5 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 3 లోక్ సభ స్థానాలు, 7 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.

ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన Election Commission

న్యూఢిల్లీ: 5 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 3 లోక్ సభ స్థానాలు, 7 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. వచ్చే నెల 6వ తేదీన నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేది. జూన్ 23న ఎన్నికలు జరుగుతాయి. 26 ఫలితాలు ప్రకటిస్తారు. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని ఆజంఘడ్ నుంచి, ఆజంఖాన్ రాంపూర్ నుంచి, పంజాబ్ సంగ్రూర్ నియోజక వర్గం నుంచి భగవంత్ మాన్ రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూర్ తో పాటు ఢిల్లీ, జార్ఖండ్, అగర్తలా, త్రిపుర సహా మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.



Election Commission of India, Akhilesh Yadav, Bhagwant Mann

Updated Date - 2022-05-26T18:08:19+05:30 IST