కోవిడ్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశం : ఈసీ

ABN , First Publish Date - 2021-04-28T21:36:07+05:30 IST

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన శాసన సభ ఎన్నికల

కోవిడ్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశం : ఈసీ

న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశించాలనుకునేవారు తప్పనిసరిగా నెగెటివ్ ఆర్‌టీ-పీసీఆర్ లేదా ఆర్ఏటీ నివేదికను కానీ, కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ రెండు మోతాదులను తీసుకున్నట్లు ధ్రువీకరించే ధ్రువపత్రాన్ని కానీ సమర్పించాలని తెలిపింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్లాలనుకునే అభ్యర్థులు, వారి తరపు ఏజెంట్లు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. 


పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి శాసన సభలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌లో చివరి దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరుగుతుంది. మే 1న అభ్యర్థులకు, వారి తరపు కౌంటింగ్ ఏజెంట్లకు ఆర్‌టీ-పీసీఆర్ /ఆర్ఏటీ టెస్టులు నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేస్తారని ఈసీ తెలిపింది. ఈ పరీక్షలు చేయించుకొనని అభ్యర్థులను, కౌంటింగ్ ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించేది లేదని తెలిపింది. కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నట్లు ధ్రువీకరించాలని, లేదా, నెగెటివ్ ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్టు కానీ, నెగెటివ్ ఆర్ఏటీ రిపోర్టు కానీ సమర్పించాలని తెలిపింది. 


Updated Date - 2021-04-28T21:36:07+05:30 IST