టీఆర్‌ఎస్‌‌కు ఎన్నికల కమిషన్‌ సహకరిస్తోంది: ఠాగూర్‌

ABN , First Publish Date - 2021-10-19T01:12:37+05:30 IST

టీఆర్‌ఎస్‌‌కు కేంద్ర ఎన్నికల కమిషన్‌ సహకరిస్తోందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ ఆరోపించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై

టీఆర్‌ఎస్‌‌కు ఎన్నికల కమిషన్‌ సహకరిస్తోంది: ఠాగూర్‌

హుజూరాబాద్‌: టీఆర్‌ఎస్‌‌కు కేంద్ర ఎన్నికల కమిషన్‌ సహకరిస్తోందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ ఆరోపించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్‌ అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. సోమవారం  ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సంపాదించిన అవినీతి సొమ్మును హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఖర్చు పెడుతుందన్నారని ఆరోపించారు. కోట్ల రూపాయలు హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో పంచుతున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు. హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్యనే పోటీ ఉందన్నారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు నాలుగు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ఇంకా పది రోజల టైం ఉందని, తమ బృందాలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తాయని మాణిక్కం ఠాగూర్‌ తెలిపారు. 

Updated Date - 2021-10-19T01:12:37+05:30 IST