కోడ్‌ ఉల్లంఘనులపై టీడీపీ ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-03-02T05:52:58+05:30 IST

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి వ్యవ హరిస్తున్న వైసీపీ అధికార ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఎన్నికల కమి షనర్‌ రమేష్‌కుమార్‌, ఎన్నికల పరిశీలకుడు ప్రవీణ్‌కుమార్‌, కలెక్టర్‌ వినయ్‌చంద్‌లను కలిసి ఫిర్యాదు చేశారు.

కోడ్‌ ఉల్లంఘనులపై టీడీపీ ఫిర్యాదు
కమిషనర్‌కు ఫిర్యాదు చేసి వస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు

ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం

మహారాణిపేట, మార్చి 1: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి వ్యవ హరిస్తున్న వైసీపీ అధికార ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఎన్నికల కమి షనర్‌ రమేష్‌కుమార్‌, ఎన్నికల పరిశీలకుడు ప్రవీణ్‌కుమార్‌, కలెక్టర్‌ వినయ్‌చంద్‌లను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతర మాట్లాడుతూ కోడ్‌ అమల్లో ఉండగా రెడ్డి కుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వీసీ ప్రసాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వలంటీర్లు, సచివాల సిబ్బంది నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్నారు.


అలాగే, మద్యం మాఫియా ఆగడాలపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో వచ్చిన కథనాలను ఎస్‌ఈసీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఆనంద పురం మండలం గండిగుండం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలను ఎన్నికల కమిషనర్‌కు వివరించినట్లు వెలగపూడి తెలిపారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలింగ్‌ బూత్‌ల్లో సీసీ కెమెరాలు అమర్చాలని కోరినట్టు తెలిపారు. యూసీడీ పీడీ వై.శ్రీనివాస్‌, ఆర్‌ఎంఓ నాగరాజులను ఎన్నికలకు దూరంగా ఉంచాలని కోరారు. 


ఏయూ వీసీపై చర్యకు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ డిమాండ్‌

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి కుల సమావేశానికి హాజ రైన ఏయూ వీసీ ప్రసాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలుగునాడు స్టేట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) ఎం.వి.ప్రణవ్‌ గోపాల్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం నిమ్మగడ్డను కలిసి ఫిర్యాదు చేశారు. గ్రీన్‌పార్క్‌ హోటల్‌లో ఆదివారం జరిగిన సమావేశానికి హాజరై వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డితో కలిసి జీవీఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని కోరారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిపై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్య లు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్‌కు కూడా ఫిరాదు చేసినట్లు తెలిపారు.  

Updated Date - 2021-03-02T05:52:58+05:30 IST