మాట్లాడుతున్న జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు
కాగజ్‌నగర్ టౌన్, జనవరి 21: వచ్చేనెల 20న కాగజ్‌నగర్ ఆర్యవైశ్య కల్యాణ మండపంలో జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాలెపు మురళీధర్, రాచకొండ నాగేశ్వర్రావు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఫిబ్రవరి 14న నామినేషన్లు దాఖలు, 17న పరిశీలన, ఉపసంహరణ ఉంటాయన్నారు. ఈసారి అధ్యక్షుడి ఎన్నికలకు కేవలం ఆసిఫాబాద్ డివిజన్ సభ్యులకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. సిర్పూర్, ఆసి ఫాబాద్ డివిజన్లకు రొటేషన్ పద్దతిన రెండేళ్ల పదవీ కాలంగా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అధ్యక్షుడి ఎన్నిక అనంతరం పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు ఉంటుందని వివరించారు. సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మెన్ గిరీష్‌కుమార్, ఎన్నికల నిర్వహణ కార్యదర్శి గణపురం ప్రకాష్, ప్రచారకార్యదర్శి కేశెట్టి శంకరయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు మైలారపు మురళీధర్ పాల్గొన్నారు.