ఎంపీపీల ఎన్నిక పూర్తి

Sep 25 2021 @ 01:27AM
మండల నూతన పాలకవర్గంతో ఎమ్మెల్యే

అధిష్ఠాన నిర్ణయాలతో అన్నింటా ఏకగ్రీవాలు

ప్రశాంతంగా ముగిసిన ప్రక్రియ

దర్శి, సెప్టెంబరు 24 : మండలంలో ఎంపీపీ. వైస్‌ ఎంపీపీ ఎన్నికలు శుక్రవారం  ప్రశాంతంగా ముగిశాయి. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మండల ఎన్నికల అధికారి కె.అర్జున్‌నాయక్‌, అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి జి.శోభన్‌బాబులు తొలుత ఎంపీటీసీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. మండలంలో మొత్తం 17 ఎంపీటీసీలు ఉండగా అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకొంది. అనంతరం మండల కో-అప్షన్‌ సభ్యుడిగా పొతకమూరుకు చెందిన జైలుద్ధీన్‌ను ఎన్నుకున్నారు. నూతన ఎంపీపీగా రాజంపల్లి ఎంపీటీసీ సభ్యురాలు గొల్లపాటి.సుధారాణి, వైస్‌ ఎంపీపీగా పొతకమూరు ఎంపీటీసీ సభ్యుడు సోము దుర్గారెడ్డిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల చేత ఎన్నికల అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీపీ సుధారాణి, వైస్‌ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, కోప్షన్‌ సభ్యుడు జైలుద్దీన్‌ ఎంపీటీసీలను ఎమ్మెల్యే వేణుగోపాల్‌ అభినందించారు. 

దొనకొండ : దొనకొండ మండల పరిషత్‌ అధ్యక్షుడి ఎన్నిక స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఎంపీపీగా వెంకటాపురం ఎంపీటీసీ కృష్ణం.ఉషారాణి, వైస్‌ ఎంపీపీగా మల్లంపేట ఎంపీటీసీ వడ్లమూడి.వెంకటేశ్వర్లు, కో-అప్షన్‌ సభ్యుడిగా షేక్‌. అబ్ధుల్‌గఫార్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సీహెచ్‌.వెంకటరెడ్డి, తహసీల్దార్‌ కె.వెంకటేశ్వరరావు, ఎంపీడీవో కె.జీ.ఎ్‌స.రాజులు ముందుగా మండల కో-అప్షన్‌ సభ్యుడిగా ఒకేఒక్క నామినేషన్‌ దాఖలు చేసిన షేక్‌.అబ్ధుల్‌గఫార్‌ను మండల కో-అప్షన్‌ సభ్యుడిగా ఎంపిక చేశారు. అనంతరం నూతన పాలకవర్గాన్ని దర్శి నియోజకవర్గ వైసీపీ నాయకుడు మద్దిశెట్టి.శ్రీధర్‌, తహసీల్దార్‌  కె.వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రాజు, ఎంఈవో సాంబశివరావు, ఎస్సై ఫణిభూషణ్‌ అధికారులు, సిబ్బంది అభినందించారు. 

కురిచేడు : మండల నూతన ఎంపీపీగా బెల్లం కోటేశ్వరమ్మ ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు. ఉదయం 10 గంటలకు రిటర్నింగ్‌ అధికారి నాగార్జున బాబు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 12 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరు అయ్యారు. ముందుగా కో-ఆప్షన్‌ సభ్యులుగా సయ్యద్‌ ఖాశీంను ఎన్నుకున్నారు. మధ్యాహ్నం సమావేశమై ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. కల్లూరు ఎంపీటీసీ సభ్యురాలు బెల్లం కోటేశ్వరమ్మను సభ్యులు ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నుకున్నారు. అనంతరం పడమర నాయుడుపాలెం ఎంపీటీసీ సభ్యురాలు షేక్‌ ఖాశీంబీని ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన పాలక వర్గాన్ని మండల పరిషత్‌ అధికారులు, ఆర్‌వో సత్కరించారు.  ప్రజాప్రతినిధులు, స్థానికులు సైతం వారిని సత్కరించారు.  కార్యక్రమంలో మద్దిశెట్టి శ్రీధర్‌ జడ్పీటీసీ సభ్యులు నుసుం వెంకట నాగిరెడ్డి, వైసీపీ నాయకులు బెల్లం చంద్రశేఖరరావు, మేరువ పిచ్చిరెడ్డి, మేరువ సుబ్బారెడ్డి, సైదా, గోపి, రాంబాబు పాల్గొన్నారు. 

 గుడ్లూరు : మండలంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.  ఎన్నికల పరిశీలకులు చల్లా నాగరాజు నేతృత్వంలో నూతన ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత పరకొండపాడు ఎంపీటీసీ సభ్యులు పులి రమేష్‌ నూతన  ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  గుడ్లూరు రెండవ ప్రాదేశికం ఎంపీటీసీ సభ్యులు మోరబోయిన శ్రీరాములును వైస్‌ ఎంపీపీగా, మండల కో  ఆప్షన్‌ సభ్యుడిగా  సభ్యులుగా షేక్‌ రషీద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వరరావు, తహసీల్దార్‌ శ్రీశిల్ప, సూపరిండెంట్‌ జయమణి,  వైసీపీ మండల కన్వీనర్‌ కాపులూరి కృష్ణ, సీనియర్‌ నాయకులు చెరుకూరి సూర్యనారాయణ, పాలకీర్తి బ్రహ్మయ్య, పాల్గొన్నారు.

సీఎ్‌సపురం : మండల ప్రజా పరిషత్‌ నూతన అధ్యక్షుడిగా మూడమంచు వెంకటేశ్వర్లు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఎంపీడీవో కట్టా శ్రీనువాసులు, మండల ప్రత్యేకాధికారి కోటేశ్వరరావులు సమక్షంలో ముందుగా ఎన్నిక జరిగింది. అనంతరం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నిర్వహించారు. ఎంపీపీగా మూడమంచు వెంకటేశ్వర్లు, వైస్‌ ఎంపీపీగా ఉప్పలపాడు ఎంపీటీసీ దుగ్గిరెడ్డి ప్రతా్‌పరెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యుడిగా వీ.భైలు గ్రామానికి చెందిన పఠాన్‌ మాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్‌ యాదవ్‌తో కలిసి భారీ బహిరంగసభ నిర్వహించారు.

పీసీపల్లి : మండలంలో ఎన్నికైన ఎంపీటీసీలతో ప్రిసైడింగ్‌ అధికారి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. మండలంలో 11 మండల పరిషత్‌ ప్రాదేశికాలు ఉండగా 2 వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. మురుగుమ్మి ప్రాదేశికం నుంచి టీడీపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి మృతి చెందడంతో ఆ ప్రాదేశికం ఎన్నిక నిలిచిపోయింది. దీంతో 8 ప్రాదేశికాలకు ఎన్నికలు జరిగాయి. ఏడు ప్రాదేశికాలలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. పీసీపల్లి మండల ఎంపీపీగా అత్యాల జపన్య, వైస్‌ ఎంపీపీగా చెరుకూరి ప్రసూన, కో ఆప్షన్‌ సభ్యుడిగా షేక్‌ అబ్దుల్‌కరీంను ఎన్నుకున్నారు.

ఉలవపాడు ఎంపీపీగా మస్తానమ్మ

ఉలవపాడు :  మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా వాయిల మస్తానమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీపీ బీసీ రిజర్వేషన్‌ కావడంతో కరేడు పంచాయతీలోని అలగాయపాలెం గ్రామానికి చెందిన వాయిల మస్తానమ్మను ఎంపీపీ పదవి వరించింది. అదేవిధంగా భీమవరం గ్రామం నుంచి దాసరి రమణయ్య మండల ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కోఆప్షన్‌ సభ్యుడిగా ఉలవపాడు ముస్లిం షేక్‌ ఖాధర్‌ భాషా ఏకైక నామినేషన్‌ దాఖలు కావడంతో కోఆప్షన్‌ సభ్యుడిగా ఏగ్రీవంగా ఎన్నుకున్నారు. 

తాళ్లూరు : తాళ్లూరు మండల ఎంపీపీగా తురకపాలెం ఎంపీటీసీ సభ్యుడు తాటికొండ శ్రీను ఏకగ్రీవం అయ్యారు. వైఎ్‌స ఎంపీపీగా తాళ్లూరు-1 ఇడమకంటి వెంకటేశ్వరరెడ్డి, మండల కో ఆప్షన్‌ సభ్యుడిగా షేక్‌ కాలేషావలి(కరిముళ్ల)లు ఏకగ్రీవమయ్యారు.  నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, కోఆప్షన్‌ సభ్యులతో ప్రిసైడింగ్‌ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ఎంపికైన ఎంపీపీ తాటికొండ శ్రీనుకు ప్రత్యేకాధికారి నాగరాజు బాధ్యతలు అప్పగించారు. దర్శి ఏఎంసీ చైర్మన్‌ ఐ.వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, పలు గ్రామాల సర్పంచ్‌లు, పాల్గొన్నారు.

కందుకూరు: కందుకూరు ఎంపీపీగా ఇంటూరి సుశీల శుక్రవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఆమెను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వైస్‌ ఎంపిపిగా పాలూరు దొండపాడు ఎంపీటీసీ సభ్యురాలు చలంచర్ల సుజాతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.