
న్యూఢిల్లీ: జనవరి 5, 2022తో పదవీకాలం ముగిసే 25 శాసన మండలి స్థానాలకు ఎన్నికలను నవంబర్ 9న కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 25 స్థానాలకు ఎన్నికలు డిసెంబర్ 10న జరగుతాయని.. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 14న వెల్లడికానున్నాయని ఈసీ పేర్కొంది. నవంబర్ 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు నవంబర్ 23 చివరి తేదీ. అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 26. సంబంధిత నియోజకవర్గాల్లో ఎన్నికల మోడల్ కోడ్ వెంటనే అమల్లోకి వస్తుందని ఈసీ పేర్కొంది. ప్రస్తుతం ఎగువ సభలో 32 మంది బీజేపీ సభ్యులు, 29 మంది కాంగ్రెస్ సభ్యులు, 12 మంది జనతాదళ్ (సెక్యులర్) సభ్యులు ఉన్నారు. ఒక స్వతంత్ర సభ్యుడు మరియు ఛైర్మన్ ఉన్నారు. 75 మంది సభ్యులున్న సభలో మెజారిటీ సాధించేందుకు ఈ ఎన్నికలను బీజేపీ పెద్ద అవకాశంగా పరిగణిస్తోంది.