వచ్చే ఎన్నికల్లో భయానక వాతావరణం: మాధవ్‌

ABN , First Publish Date - 2021-11-04T00:46:54+05:30 IST

రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు భయానక వాతావరణంలో జరగనున్నాయని ఎమ్మెల్సీ మాధవ్‌ ఆందోళన వ్యక్తంచేశారు.

వచ్చే ఎన్నికల్లో భయానక వాతావరణం: మాధవ్‌

విశాఖపట్నం: రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు భయానక వాతావరణంలో జరగనున్నాయని ఎమ్మెల్సీ మాధవ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన తిరుపతి లోక్‌సభ, బద్వేలు శాసనసభ ఉప ఎన్నికల్లో వైసీపీ రిగ్గింగ్‌, బూత్‌ల స్వాధీనం వంటి చర్యలకు దిగిందని ఆరోపించారు. 600 బస్సుల్లో దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించారన్నారని దుయ్యబట్టారు. ప్రజలు వ్యతిరేకించినా బలవంతంగా ఓట్లు వేయించుకున్నారని, రాబోయే ఎన్నికల్లోను ఇదే జరుగుతుందని హచ్చరించారు. దీనిపై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామని ప్రకటించారు. విశాఖపట్నంలో విలువైన ఆస్తులు తనఖా పెట్టారని, చట్టసభల్లో బిల్లు పెట్టకుండా అలా చేయడం తప్పు అని వ్యాఖ్యానించారు. దీనికి గవర్నర్‌ను గ్యారంటీగా చూపడం మరీ దారుణమని మాధవ్ అన్నారు.

Updated Date - 2021-11-04T00:46:54+05:30 IST