పురపోరుకు మోగిన నగారా

ABN , First Publish Date - 2022-01-27T17:10:21+05:30 IST

రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీలకు ఎన్నికల నగారా మోగింది. ఈ మొత్తం ఎన్నికలను ఒకే విడతలో ఫిబ్రవరి 19న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల

పురపోరుకు మోగిన నగారా

ఒకే విడతలో ఎన్నిక

ఫిబ్రవరి 19న పోలింగ్‌, 22న లెక్కింపు

ఈ నెల 28 నుంచి నామినేషన్ల స్వీకరణ

అమల్లోకి వచ్చిన కోడ్‌


చెన్నై/పెరంబూర్‌: రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీలకు ఎన్నికల నగారా మోగింది. ఈ మొత్తం ఎన్నికలను ఒకే విడతలో ఫిబ్రవరి 19న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణ యించింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో బుధవారం సాయంత్రమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో కొత్త పథకాలు, ప్రారం భోత్సవాలకు బ్రేక్‌ పడిపోయింది. రాష్ట్రంలో 2016లో నిర్వహిం చాల్సిన ఎన్ని కలు వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. అయితే సుప్రీంకోర్టు కొరడా ఝళిపించేందుకు సిద్ధమవ్వడంతో ఆగమేఘాలపై స్పందించిన అధి కారులు.. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు. కార్పొరేషన్‌, పట్టణ పంచాయితీ, మున్సిపాలిటీ పదవులకు సంబంధించి రిజర్వేషన్ల పనులు కూడా చకచకా పూర్తి చేశారు. దాంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. 


ఒకే విడత ఎన్నికలు...

స్థానిక కోయంబేడులోని ఎన్నికల కార్యాలయంలో బుధవారం సాయం త్రం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ పళనికుమార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిం చారు. రాష్ట్రంలో వున్న 21 కార్పొరేషన్లు, 138 పట్టణ పంచాయతీలు, 490 మున్సిపాలిటీల్లో ఒకే విడతలో ఫిబ్రవరి 19వ తేది ఎన్నిక జరుగనుంది. ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 28 నుంచి ఫిబ్ర వరి 4వ తేదీ వరకు జరుగనుంది. ఆయా జిల్లాల్లోని ఎన్నికల కార్యా లయా ల పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామి నేషన్‌ పత్రాలు దాఖలుచేయవచ్చు. ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన జరుగ నుండగా, 7వ తేదీలోగా ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 19న పోలింగ్‌, 22న ఓట్ల లెక్కింపు జరుగనుంది. కాగా ఎన్నికల్లో విజయం సాధించినవారు మార్చి 2వ తేదీ ప్రమాణ స్వీకారం చేయ నుండగా, కార్పొరేషన్‌ మేయర్‌, మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ చైర్మన్ల పరోక్ష ఎన్నిక మార్చి 4న జరుగనుంది. 


2.79 కోట్ల మంది ఓటర్లు...

ఈ ఎన్నికల్లో మొత్తం 2 కోట్ల 79 లక్షల 56 వేల 754 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోను న్నారు. ఇందులో పురుషులు 1,37,06,793 మంది కాగా, మహిళా ఓటర్లు 1,42,45,637, హిజ్రాలు 4,324 మంది వున్నారు. ఈ ఎన్నికల కోసం 31,029 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల విధుల్లో ఒక కేంద్రానికి నలుగురు చొప్పున 1.33 లక్షల మంది సిబ్బంది, 80 వేల మంది పోలీసులు పాల్గొననున్నారు. చెన్నై కార్పొరేషన్‌లో 61,18,734 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కోనుండగా, ఇందులో పురుషులు 30,23,803, మహిళలు 30,93,355, హిజ్రా లు 1,576 మంది వున్నారు. నగర కార్పొరేషన్‌ పరిధిలో 5,794 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మున్సిపాలిటీలో పోటీ చేసే అభ్యర్థి ఎన్ని కల వ్యయం రూ.17 వేలు, మొదటి రకం మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ అభ్యర్థి రూ.34 వేలు, చెన్నై కార్పొరేషన్‌లో అభ్యర్థి రూ.90 వేలుగా నిర్ణయించారు.


ఇంటింటి ప్రచారానికి ముగ్గురికే అనుమతి

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీలకు సంబం ధించిన ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించగానే బుధవారం సాయంత్రం నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాలు ప్రక టించడానికి వీల్లేదు. అయితే ఇప్పటికే ఉన్న పథకాలు అమలుచేయవచ్చు. ఇదిలా వుండగా ఒక వ్యక్తి రూ.50 వేలకు మించి తీసుకెళ్లడానికి వీల్లేదు. అలా తీసుకెళ్లాల్సి వస్తే అందుకు సంబంధించిన పత్రాలను చూపించా ల్సివుం టుందని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఇదిలా వుండగా ఇంటింటి ప్రచారానికి ముగ్గురిని మాత్రమే అనుమతించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. అంతేగాక ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధం. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని ఆదేశించింది. చెన్నై కార్పొరేషన్‌ పోలింగ్‌ పర్యవేక్షణకు ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు, మిగిలిన జిల్లాలకు ఒక్కో ఐఏఎస్‌ అధికారిని నియమించింది. 

Updated Date - 2022-01-27T17:10:21+05:30 IST