కుక్కర్‌‌తోనూ మాస్కుల శానిటైజేషన్ సాధ్యమే..! ఎలాగంటే..

ABN , First Publish Date - 2020-08-08T14:51:16+05:30 IST

ఎలక్ట్రిక్‌ కుక్కర్‌తో అన్నం వండుకోవడమే కాకుండా మాస్కులను కూడా శానిటైజ్ చేయచ్చనే విషయం ఇటీవల అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.

కుక్కర్‌‌తోనూ మాస్కుల శానిటైజేషన్ సాధ్యమే..! ఎలాగంటే..

ఇల్లియాయ్(అమెరికా): ఎలక్ట్రిక్‌ కుక్కర్‌తో అన్నం వండుకోవడమే కాకుండా మాస్కులను కూడా శానిటైజ్ చేయచ్చనే విషయం ఇటీవల అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. కరోనాను అడ్డుకునే ఎన్95 మాస్కులను విద్యుత్ కుక్కర్లు శానిటైజ్ చేయగలవని యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయ్‌కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. కుక్కర్‌లో 50 నిమిషాల పాటు ఈ మాస్కులను ఉంచితే అన్ని రకాల కరోనా వైరస్‌లు నశించిపోతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే.. ఇలా శానిటైజ్ చేసేందుకు నీరు మాత్రం వినియోగించరాదని వారు సూచించారు. డిమాండ్ అధికంగా ఉండటంతో మాస్కులకు కొరత ఏర్పడుతోందని, పాత వాటినే మళ్లీ మళ్లీ వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కారణంగానే మాస్కుల వినియోగించే విషయంలో కొత్త పద్ధతులు అవలంబించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. దీంతో మాస్కుల పునర్వీనియోగం జరిగేలా శానిటైజ్ చేసేందుకు కొత్త విధానాల కోసం తాము ప్రయత్నిస్తున్నామని, ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ కుక్కర్‌కు ఉన్న శానిటైజేషన్ సామర్థ్యాన్ని గుర్తించామన్నారు. ఈ అధ్యయనం వివరాలు ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మాటర్స్ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి. 


Updated Date - 2020-08-08T14:51:16+05:30 IST