Viral News: హవ్వా.. ఎలక్ట్రిక్ వాహనాలకూ ఆ సర్టిఫికేట్ కావాలట!

ABN , First Publish Date - 2022-09-09T18:17:07+05:30 IST

ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric scooter) యజమానికి ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన చలానాకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. అధికారుల పని తీరు చూసి నవ్వుకుంటున్నారు.

Viral News: హవ్వా.. ఎలక్ట్రిక్ వాహనాలకూ ఆ సర్టిఫికేట్ కావాలట!

ఇంటర్నెట్ డెస్క్: ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric scooter) యజమానికి ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన చలానాకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. అధికారుల పని తీరు చూసి నవ్వుకుంటున్నారు. గతంలో విమర్శలు వచ్చినా అధికారుల తీరు మారలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇంకతూ పోలీసులు ఏం చేశారు? నెటిజన్లు ఎందుకని అధికారులపై మండిపడుతున్నారు? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


రోజు రోజుకు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ కాలుష్యాన్ని అదుపు చేయాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని పెద్ద మొత్తంలో కట్టడి చేయవచ్చని.. ఆ వైపుగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డిజిల్ ధరల కారణంగా ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఎలక్ట్రిక్ వాహనం వల్ల పొల్యూషన్ జరగదన్న విషయం తెలుసో లేదో కానీ ఓ ట్రాఫిక్ పోలీస్ అధికారి ద్విచక్ర వాహనదారుడికి షాకిచ్చాడు. పొల్యూషన్ సర్టిఫికెట్ (pollution certificate) లేదనే కారణంతో ఎలక్ట్రిక్ స్కూటీ(Electric scooter) యజమానికి రూ.250 Fine వేశాడు. ఈ ఘటన కేరళ(Kerala)లోని మలప్పురం జిల్లాలో చోటు చేసుకోగా.. ప్రస్తుతం అందుకు సంబంధించిన చలానా ఫొటో నెట్టింట వైరల్(challan receipt goes viral) అవుతోంది. 




ఇదిలా ఉంటే.. గతంలో కూడా పోలీసులు ఇదే తరహాలో వాహనదారుడికి అన్యాయంగా జరిమానా విధించారు. బుల్లెట్ బండిలో సరిపడా పెట్రోల్ లేదనే కారణంతో రూ.250 ఫైన్ వేశారు. అప్పట్లో ఈ వార్త హాట్ టాపిక్ కూడా అయింది. ఉన్నతాధికారులు కూడా స్పందించి.. ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని కూడా కింది స్థాయి సిబ్బందికి సూచించారు. 


Updated Date - 2022-09-09T18:17:07+05:30 IST