విద్యుత్‌ స్తంభంపై ఎగిసిన మంటలు

Published: Wed, 25 May 2022 13:14:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విద్యుత్‌ స్తంభంపై ఎగిసిన మంటలు

మణుగూరు(భద్రాద్రి కొత్తగూడెం): మణుగూరు పట్టణంలోని అశోక్‌నగర్‌ ప్రాంతంలోని ఓ విద్యుత్‌ స్తంభంపై బుధవారం మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. విద్యుదా ఘాతం లేదా అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈఘటన జరిగి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. ఈ విషయమై ఏడీఈ జీవన్‌ను ఆంధ్రజ్యోతి ప్రశ్నించగా విద్యుత్‌ స్తంభంపై ఉన్న ఓ ఇంటి సర్వీస్‌ వైర్‌ కారణంగా విద్యుదాఘాతం ఏర్పడిందన్నారు. సమాచారం తెలియగానే  సిబ్బంది సమస్యను పరిష్కరించారని వివరించారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.