వారంలో విద్యుత్‌ పనులను పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-06-24T06:53:14+05:30 IST

వారం రోజుల వ్యవధిలో విద్యుత్‌ సంబంధిత పనులన్నీ పూర్తిచేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పనుల ప్రగతిపై గురువారం సాయంత్రం అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

వారంలో విద్యుత్‌ పనులను పూర్తిచేయాలి

నిజామాబాద్‌అర్బన్‌, జూన్‌ 23: వారం రోజుల వ్యవధిలో విద్యుత్‌ సంబంధిత పనులన్నీ పూర్తిచేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పనుల ప్రగతిపై గురువారం సాయంత్రం అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. నివాస ప్రాంతాల్లో వంగిన విద్యుత్‌ స్తంభాలను సరిచేస్తూ, శిఽథిలావస్థకు చేరిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి వేలాడుతున్న తీగలను సరిచేయాలన్నారు. డీడీలు చెల్లించిన 135 వైకుంఠధామాలకు తక్షణమే విద్యుత్‌ సదుపాయం కల్పించాలన్నారు. ప్రతి వైకుంఠధామంలో తప్పనిసరిగా బల్బు వెలిగేలా, బోరుమోటారు పనిచేసేలా చూడాలన్నారు. విద్యుత్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేయించేందుకు మండల పంచాయతీ అధికారులు ప్రత్యేక చొరవచూపాలని, ట్రాన్స్‌కో ఏఈలు పూర్తి సహకారం అందించాలన్నారు. జిల్లాలోని అన్ని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ల ఆవరణంలోని ఖాళీప్రదేశాల్లో ఈసారి హరితహారం కింద పెద్దఎత్తున మొక్కలు నాటాలని ఆయన సూచించారు. ఒక్కో సబ్‌స్టేషన్‌ల వారిగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని వచ్చే వారం ఈ అంశంపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ వీసీలో డీపీవో జయసుధ, ట్రాన్స్‌కో డీఈ వెంకటరమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 


సహజ కాన్పులను ప్రోత్సహించాలి 

సిజేరియన్‌ల నియంత్రణకు సమష్టిగా కృషి చేయాలి: కలెక్టర్‌

నిజామాబాద్‌అర్బన్‌, జూన్‌ 23: ఆరోగ్యకర సమాజం కోసం సహజకాన్పులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. సిజేరియన్‌ల నియంత్రణకు కలిసికట్టుగా కృషి చేస్తూ నేటి తరం మహిళల ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. గురువారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ మీడి యా ప్రతినిధులతో మాట్లాడారు. జిల్లాలో సిజేరియన్‌ కాన్పులు లెక్కకు మించి జరుగుతున్నాయని దీని వల్ల మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మేలో జిల్లా మొత్తం 1913 కాన్పులు కాగా అందులో 75శాతం వరకు 1444 కాన్పులు సిజేరియన్‌ అని కేవలం 459 మాత్రమే సాధా రణ ప్రసవాలు జరిగాయని కలెక్టర్‌ తెలిపారు. జూలైలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జరిగే ప్రతికాన్పును పరిశీలన జరిపిస్తామని అవసరం లేకపోయినా సిజేరియన్‌ చేస్తున్న ఆసుపత్రుల తీరును ప్రజల ముందుంచుతామన్నారు. ముహూర్తం కాన్పులు, పురిటి నొప్పు లు తాళలేక సిజేరియన్‌ చేయాలని కోరే గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు సాధారణ ప్రసవం వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ సాధారణ డెలివరీ అయ్యేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో 50 శాతం కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరుగుతున్నాయని వీటి సంఖ్య మరింత పెంచేలా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి, బోధన్‌, ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామన్నారు. గర్భందాల్చిన నాటి నుంచే క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

ఫ 49లక్షల మొక్కలు నాటేలా లక్ష్యం..

 హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ సారి 49లక్షల మొక్కలు నాటేలా లక్ష్యం పెట్టుకున్నామని పల్లెప్రకృతి వనాలు, బృహత్‌ పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, ఇతర ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం జరుగుతుందని చెరువులు, కాల్వగట్లపై విరివిగా మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సారంగాపూర్‌, చిన్నాపూర్‌ అర్బన్‌ పార్కులు, అటవీ స్థలాలు, జాతీయ రహదారికి ఇరువైపులా ఆకర్షనీయమైన మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. 

ఫ 407 పాఠశాలలు ఎంపిక..

మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో 407 పాఠశాలలు ఎంపిక కాగా 132 బడుల్లో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా 405 తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి రానున్నాయని, 2 కోట్ల రూపాయలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షే మ వసతి గృహాల మరమ్మతులు జరిపిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. సెల్‌కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-24T06:53:14+05:30 IST