చినుకు పడితే చీకటి

ABN , First Publish Date - 2021-07-24T06:08:19+05:30 IST

చినుకు పడితే గిరిజన గ్రామాలు అంధకారంలో మగ్గు తున్నాయి.

చినుకు పడితే చీకటి
వటువర్లపల్లి గ్రామ వ్యూ

- అంధకారంలో నల్లమల

- వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు గ్రామాలకు నిలిచిన విద్యుత్‌ సరఫరా

- వర్షాలకు చెట్లపై ఉన్న తీగలు తెగుతుండటంతో తరచూ సమస్య

- కొత్త లైన్‌ ఏర్పాటుకు అనుమతి ఇవ్వని అటవీ శాఖ


దోమలపెంట, జూలై 23 : చినుకు పడితే గిరిజన గ్రామాలు అంధకారంలో మగ్గు తున్నాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో, ఆ గ్రామాల్లో చీకట్లు అలుముకుంటు న్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమల అభయారణ్యంలోని అమ్రాబాద్‌ మండలం వటువ ర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు గ్రామాల పరిస్థితి ఇది.

2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ హయాంలో రూ.1.70 కోట్ల నిధుల తో మన్ననూర్‌ నుంచి వటువర్లపల్లి వరకు దాదాపు 25 కిలోమీటర్ల మేర 850 స్తంభాలను విద్యుత్‌ శాఖ అధికారులు పాతించారు. 11 కేవీ సింగిల్‌ ఫేస్‌ కరెంటు లై న్‌ ఏర్పాటు చేసి, విద్యుత్‌ సరఫరా చేశారు. అటవీ ప్రాంతం కావడంతో చాలా చోట్ల వైర్లన్నీ చెట్ల మీదుగానే వెళ్లాయి. దీంతో చిన్న పాటి వర్షం కురిసినా, విద్యుత్‌ తీగలు తెగిపోయతున్నాయి. దీంతో వటువర్లపల్లితో పాటు సమీపంలోని సార్లపల్లి, కుడిచింత లబైలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. గతంలో కురిసిన వర్షాలకు, ఈ దురు గాలులకు చాలా చోట్ల స్తంభాలు విరిగిపోయాయి. అలాగే శ్రీశైలం-హైదరాబాద్‌ ఘాట్‌ రోడ్డుపై పలు సందర్భాల్లో వాహనాలు స్తంభాలను ఢీ కొట్టడంతో శిథిలమయ్యా యి. వీటన్నిటికీ నాలుగేళ్ల కిందట రూ.40 లక్షల నిధులతో విద్యుత్‌ శాఖ 80 కొత్త స్తం భాలను ఏర్పాటు చేసింది. 25 కిలోమీటర్ల పొడువునా 200 చోట్ల తీగలు తెగిపోవడం తో, వాటికి అతుకులు వేసింది. అయితే, ఇంకా విద్యుత్‌ తీగలు చెట్ల పైనే ఉండటంతో, సమస్య పరిష్కారం కావడం లేదు. గతంలో పునరుద్ధరించిన స్తంభాల్లో ఇప్పటికే చా లా వరకు మళ్లీ దెబ్బతిన్నాయి, అలాగే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కూడా చెట్ల కొ మ్మలపై ఉన్న వైర్లు తెగిపోయి, ఐదు రోజులుగా వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచిం తల బైలు గ్రామాలకు ఐదు రోజులుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఈ గ్రా మాల ప్రజలు అంధకారంలోనే కాలం వెల్లదీస్తున్నారు. అలాగే తాగునీటికి కూడా హా హాకారాలు పెడుతున్నారు. దీనికితోడు గతేడాది గిరి వికాస్‌ పథకం  కింద 16 చెం చు పెంటలకు విద్యుత్‌ లైన్‌ ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. 

ఈ సమస్యను పరిష్కరించాలని గతేడాది వటువర్లపల్లి సర్పంచ్‌ ఛత్రునాయక్‌ సీ ఎం ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్‌, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని కలిసి వి నతి పత్రం ఇచ్చారు. సమస్య పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. కానీ, ఏడాదైనా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఈ విషయంపై శుక్రవారం ఆయన నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ ఎల్‌పీ శర్మన్‌, విద్యుత్‌ శాఖ డీఈని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇ ప్పటికైనా ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పందించి, నూతన విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు, విద్యుత్‌ తీగలకు తగులుతున్న చెట్ల కొమ్మలను తొలగించేందుకు అనుమతులు ఇప్పించాలని నల్లమల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-07-24T06:08:19+05:30 IST