విద్యుత్‌ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి

Published: Tue, 09 Aug 2022 00:12:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విద్యుత్‌ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలినిరసన సభలో మాట్లాడుతున్న జేఏసీ చైర్మన్‌ వెంకన్న

సూర్యాపేటటౌన్‌, ఆగస్టు 8: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఎలక్ర్టీసిటీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ వెంకన్న డిమాండ్‌ చేశారు. జిల్లాకేంద్రంలోని విద్యుత్‌ కార్యాలయంలో సోమవారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరంచేసే కుట్రలు చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్‌ సవరణ బిల్లును విద్యుత్‌ సంస్థలన్నీ వ్యతిరేకిస్తున్నాయని అయినా కేంద్ర ప్రభుత్వం మెండిగా బిల్లును ప్రవేశపెడితే నిరవదిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ పాల్‌రాజ్‌, డీఈలు శ్రీనివాస్‌, ఏడీ లు వినోద్‌కుమార్‌, శ్రీనివాస్‌, ఇందిర, నాయకులు యాదగిరి నాయుడు, మల్లికార్జున్‌, బా లకృష్ణ, భాస్కర్‌, వెంకటనారాయణ, దయాకర్‌రెడ్డి, రషీద్‌, లింగయ్య పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.