కరెంట్‌ భారం ఏటా రూ.2 వేల కోట్లు

ABN , First Publish Date - 2021-12-29T16:14:26+05:30 IST

విద్యుత్‌ చార్జీలు పెరిగితే గ్రేటర్‌ పై ఏటా సుమారు రూ. 2 వేల కోట్ల భారం పడే అవకాశముంది. ప్రతి నెలా మొత్తం కరెంట్‌ వినియోగం 1900 మిలియన్‌ యూనిట్లు(ఎంయూ)గా నమోదవుతోంది. అందులో గృహ విద్యుత్‌ వినియోగం 500

కరెంట్‌ భారం ఏటా రూ.2 వేల కోట్లు

హైదరాబాద్‌ సిటీ: విద్యుత్‌ చార్జీలు పెరిగితే గ్రేటర్‌ పై ఏటా సుమారు రూ. 2 వేల కోట్ల భారం పడే అవకాశముంది. ప్రతి నెలా మొత్తం కరెంట్‌ వినియోగం 1900 మిలియన్‌ యూనిట్లు(ఎంయూ)గా నమోదవుతోంది. అందులో గృహ విద్యుత్‌ వినియోగం 500 మిలియన్‌ యూనిట్లు కాగా, వాణిజ్య, పరిశ్రమల వినియోగం 1400 మిలియన్‌ యూనిట్లుగా ఉంటుంది. గ్రేటర్‌లోని తొమ్మిది సర్కిళ్లలో 48 లక్షల గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, ఏడు లక్షల వరకు వాణిజ్య, హెచ్‌టీ, వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన గృహ కనెక్షన్లకు సంబంధించి 500 ఎంయూలకు యూనిట్‌కు రూ. 50 పైసల చొప్పున ప్రతినెలా రూ. 25 కోట్లు, వాణిజ్య పరిశ్రమల కేటగిరిలో 1400 ఎంయూలకు ఒక్కఓ యూనిట్‌ రూపాయి చొప్పున నెలకు రూ. 140 కోట్ల భారం పడే అవకాశముందని విద్యుత్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. చార్జీలు పెరిగితే గృహ, వాణిజ్య, పరిశ్రమల కేటగిరిల వారీగా మొత్తం ప్రతినెలా గ్రేటర్‌పై సుమారు 165 కోట్లు, ఏటా రెండు వేల కోట్ల భారం పెరిగే అవకాశాలున్నాయి. రాష్ట్ర వ్యాప్త విద్యుత్‌ డిమాండ్‌లో గ్రేటర్‌ భాగం సుమారు 40-45 శాతంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో యూనిట్‌ చార్జీలు పెరిగితే అదే స్థాయిలో గ్రేటర్‌పై చార్జీల భారం పడుతుంది. 

Updated Date - 2021-12-29T16:14:26+05:30 IST