ఏప్రిల్‌ నుంచి మళ్లీ విద్యుత్‌ చార్జీల బాదుడు

ABN , First Publish Date - 2022-01-22T06:34:31+05:30 IST

వచ్చే ఏప్రిల్‌ నుంచి విద్యుత్‌ చార్జీల మోత మోగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వినియోగదారుల నుంచి అభి ప్రాయాల పేరిట దీనికి ఆమోదముద్ర వేయనుంది.

ఏప్రిల్‌ నుంచి మళ్లీ విద్యుత్‌ చార్జీల బాదుడు

  • 24 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

రాజమహేంద్రవరం, జనవరి 21(ఆంధ్రజ్యోతి): వచ్చే ఏప్రిల్‌ నుంచి విద్యుత్‌ చార్జీల మోత మోగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వినియోగదారుల నుంచి అభి ప్రాయాల పేరిట దీనికి ఆమోదముద్ర వేయనుంది. ఈనెల 24, 25, 27 తేదీల్లో ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. ఏపీఈపీడిసిఎల్‌ రాజమహేంద్రవరం ఎస్‌ఈ టీవీఎస్‌ఎన్‌ మూర్తి శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి  ఆధ్వ ర్యంలో 2020- 23 ఆర్థిక సంవత్సరానికి వార్షికాదాయ అవసరాలు, రిటైల్‌ ధరలపై బహిరంగ ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా అభిప్రాయాలు సేకరించనున్నారు. ఆయా నిర్ణీత తేదీల్లో రోజూ ఉదయం 10.30 గం టల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకూ, మళ్లీ 2 గంటల నుంచి 4.30 గంటల వరకూ  అన్ని డిస్కమ్‌ల టారిఫ్‌ ఫైలింగ్‌కు సూచనలు, అభ్యంతరాలు వింటారు. సందేహాలు, సూచనలు ఇచ్చే వినియోగదారులు తమ వివరాలు ముందుగా రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలి. ఇలా నమోదు చేసుకున్న వారి అభిప్రాయాలు స్వీకరిస్తారు. 

Updated Date - 2022-01-22T06:34:31+05:30 IST