Nizamabad: విద్యుత్ శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-05-16T16:41:59+05:30 IST

విద్యుత్ శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆర్మూర్‌లోని విద్యుత్ శాఖ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Nizamabad: విద్యుత్ శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

నిజామాబాద్: విద్యుత్ శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆర్మూర్‌లోని విద్యుత్ శాఖ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు పెద్ద ఎత్తున్న వ్యాపిస్తున్నాయి. విద్యుత్ ఆఫీసులో ఉన్న ఫైల్స్, ఫర్నిచర్ మంటల్లో దగ్ధం అయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-05-16T16:41:59+05:30 IST