అటవీప్రాంత ఆవాసాలకు విద్యుత్‌ సౌకర్యం

ABN , First Publish Date - 2022-05-11T07:18:11+05:30 IST

మారుమూల అటవీప్రాంతంలో నివాస ముంటున్న ఆవాసాలకు విద్యుత్‌ సదుపాయం కల్పించనున్నట్లు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

అటవీప్రాంత ఆవాసాలకు విద్యుత్‌ సౌకర్యం
మంత్రిని కలిసిన నాయకులు

త్వరితగతిన అనుమతులకు నిర్ణయం

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, మే 10 : మారుమూల అటవీప్రాంతంలో నివాస ముంటున్న ఆవాసాలకు విద్యుత్‌ సదుపాయం కల్పించనున్నట్లు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం అరణ్యభవన్‌లో అటవీ, గిరిజన సంక్షేమం, విద్యుత్‌శాఖ అధికారులతో సమన్వయ సమా వేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న వేగంగా అనుమతులు ఇవ్వడం, తక్షణం పనులు చేపట్టడం తదితర అంశాలపై చర్చించారు. 232 ఆవాసాలకు త్రిఫేజ్‌ విద్యుత్‌ సదుపాయం కల్పించాల్సి ఉందని అధికారులు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేర కు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. నిబంధనల మేరకు అనుమ తుల ప్రక్రియ పూర్తి చేసేందుకు అటవీశాఖ స్పందిస్తుందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్‌ఎం దోబిరియాల్‌ తెలిపారు. రక్షిత అటవీ ప్రాంతాలైన 182 ఆవాసాలకు విద్యుత్‌ సౌకర్యం అందించాల్సి ఉందని అన్నారు. ఇవి ఆదిలాబాద్‌, నిర్మల్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల్‌, కొత్త గూడెం, నాగర్‌కర్నూల్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని విభాగాలకు చెందిన పనులు వేగవంతం చేసేందుకు సమావేశంలో నిర్ణయిం చారు. అదనపు పీసీసీఎఫ్‌లు మోహన్‌చంద్ర ఫర్గెన్‌, ఏకే సిన్హా, కాన్సెంర్వేటర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

నిర్మల్‌లో పది పరీక్షా పత్రాల మూల్యాంకనం

జిల్లాకేంద్రంలో పదిపరీక్షాపత్రాల మూల్యాంకన కేంద్రం ఏర్పాటు కానుంది. పలు ఉపాధ్యాయ సంఘాలు నిర్మల్‌లో మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మంత్రి చొరవతో ఇక్కడ మూల్యాంకన కేంద్ర మంజూ రు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా నిర్మల్‌ పీఆర్టీయూశాఖ అధ్యక్ష కార్యదర్శులు నరేంద్రబాబు, రమణారావు మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. 

పది మూల్యాంకన కేంద్రం పరిశీలన

కొత్తగా మంజూరైన పదవ తరగతి మూల్యాంకన కేంద్రాన్ని మంగళ వారం డీఈవో రవీందర్‌రెడ్డి పరిశీలించారు. కొండాపూర్‌ సమీపంలోని సెయింట్‌ ఽథామస్‌ స్కూల్‌లో కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. అక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. పరీక్షల సహాయ అధికారి పద్మ, సూపరెండెంట్‌ భోజన్నలకు పలు సూచనలు చేశారు. 

Read more