మిల్లర్లపై విద్యుత్‌ వడ్డన !

ABN , First Publish Date - 2022-07-06T06:10:14+05:30 IST

మిల్లర్లపై విద్యుత్‌ వడ్డన !

మిల్లర్లపై విద్యుత్‌ వడ్డన !

పెనాల్టీ రూపంలో బాదుడు
పరిశ్రమల జాబితా చేర్చి వేధింపులు..యాజమాన్యాలు లబోదిబో
ధాన్యం ఆడకపోతే రైతులపై ప్రభావం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)
రైతు బాగుండాలంటే రైస్‌ మిల్లింగ్‌ పరిశ్రమ సక్రమంగా ఉండాలి. సమర్ధవంతంగా పనిచేయాలి. ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని ఎప్పటి కప్పుడు మరాడించాలి. తిరిగి  ప్రభుత్వానికి బియ్యం అప్పగించాలి. పశ్చిమలో ఈ ప్రక్రియ మరింత వేగవంతంగా సాగాలి. లేదంటే రైతులకే అంతిమంగా నష్టం జరుగుతుంది. వాస్తవానికి సార్వా, దాళ్వా సీజన్‌లలో దాదాపు 15 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కస్లమ్‌ మిల్లింగ్‌ కోసం మిల్లర్లకు చేరవేస్తోంది. ధాన్యాన్ని మరాడించి అప్పగించకపోతే బ్యాంకు గ్యారంటీలు విడుదల కావు. అదే జరిగితే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కష్టమవుతుంది. ప్రభుత్వం పైనే ఆ భారం పడుతుంది. రైతుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. ఇవేమీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టలేదు. రబీలో రైస్‌ మిల్లులకు కోతలు విధించారు. విద్యుత్‌ సరఫరా ఉన్నా సరే పరిమితులు విధించారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వ్యవధి లోనే మిల్లులు తిప్పాలని విద్యుత్‌ శాఖ అదేశాలు జారీచేసింది. దీనిని ఉల్లంఘించారంటూ విద్యుత్‌ శాఖ భారీ జరిమానాలు విధించింది. మిల్లర్లను ఉక్కిరి బిక్కిరి చేసింది. గడిచిన ఒక్క నెలలోనే ప్రతి మిల్లరు అదనంగా రూ.2 లక్షలు విద్యుత్‌ శాఖకు చెల్లించాలి. జరిమానాల పేరుతో మిల్లర్లపై వడ్డించేశారు. నిబంధనలు ఉల్లంఘించారన్న సాకు చూపారు. గడచిన వేసవిలో ధాన్యం మరా డించకపోతే ఇప్పటికీ ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు సాధ్యమయ్యేది కాదు. రైతు వద్దే ధాన్యం ఉండిపోయేవి. దీనిని దృష్టిలో ఉంచుకుని మిల్లర్లు మరా డించారు. విద్యుత్‌ సరఫరా సమ యంలో మిల్లులు తిప్పారు. ప్రభు త్వానికి అనుకున్నట్టుగా బియ్యాన్ని అప్పగించారు. అయినప్పటికీ ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయలేకపోయింది.
వరి రైతుపై కపట ప్రేమ
జిల్లాలో వరి ప్రధాన పంట. దానిని అత్య వసరంగా ప్రకటించాలి. అటువంటిది ప్రభుత్వం విద్యుత్‌ కోతల పేరుతో  ధాన్యం మిల్లులపై ఆంక్షలు విధించింది. ఒక దశలో పరిశ్ర మలకు వెసులుబాటు కల్పించింది. ఆ జాబితాలో ధాన్యం మిల్లులు మాత్రం లేవు. వారంలో రెండు రోజులు పూర్తి స్థాయి పవర్‌ హాలీడే ప్రకటించారు. పరిశ్రమలకు తర్వాత వెసులుబాటు ఇచ్చారు. రైస్‌ మిల్లులకు మాత్రం ఆ విధమైన ప్రోత్సాహం కరువైంది. కోతల విషయంలోనూ విద్యుత్‌ శాఖ కటువుగా వ్యవహరించింది. సాయం త్రం వేళ మిల్లులను సందర్శించేందుకు వెళ్లేవారు. మిల్లులు తప్పితే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేశారు. తీరా మిల్లులు తిప్పి నందుకు రెట్టింపు బిల్లులు వసూలు చేశారు. దీనివల్ల రైతులు సైతం ఇబ్బందులు పడ్డారు. ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బం దులు పడాల్సి వచ్చింది. చివరకు బ్రోకర్‌లను ఆశ్రయించి రూ.200 తక్కువ కు ధాన్యాన్ని అమ్ముకున్నారు. నిజానికి మిల్లులు సక్రమం గా పనిచేస్తే ఇలాంటి సమస్యలు ఉండవు. బ్యాంకు గ్యారంటీల్లోనూ వెసులుబాటు కల్పిస్తే మిల్లు లకు ధాన్యం సకాలంలో చేరుకుంటాయి. బిల్లులు నమోదవుతాయి. రైతులకు సక్ర మంగా సొమ్ములు చెల్లించేందుకు అవకా శం ఉంటుంది. ప్రభుత్వం వద్ద సొమ్ము లు లేకపోవడంతో రైతులకు ఇవ్వలేక పోయారు. పైగా మిల్లర్లపైనే నెపం పెట్టే ప్రయత్నం చేశారు. బ్యాంకు గ్యారెంటీలను తెరపైకి తెచ్చారు. ఇలా ప్రభుత్వం వరి రైతులపై కపట ప్రేమను ఒలకబోస్తోంది. సంక్షేమ పథకాలకు సొమ్ములు వేస్తున్న ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వకపోవడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవెపు రైతులు ఆధారపడే మిల్లర్లకు ప్రభుత్వం విద్యుత్‌ బిల్లుల పేరుతో నడ్డివిరిచింది.
గ్యారెంటీల పేరుతో కాలయాపన
మిల్లర్ల వద్ద బ్యాంకు గ్యారంటీలు లేవంటూ ప్రభుత్వం కాల యాపన చేసింది. బ్యాంకు గ్యారంటీల విషయంలో గతంలో మాదిరి వెసులుబాటు కల్పించలేదు. క్వింటాలు ధాన్యానికి గ్యారంటీ ఇస్తే అంత మొత్తం ధాన్యాన్నే మిల్లర్లకు అప్పగిం చారు. గడచిన ఖరీఫ్‌లో ఒకటికి మూడు రెట్లు బ్యాంకు గ్యారంటీ అమలు చేసింది. రబీలో మాత్రం ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది. ప్రభుత్వం రూ.1,250 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేస్తే మిల్లర్లు రూ.720 కోట్లకు మాత్రమే బిజిలు సమర్పించారు. మిల్లులకు చేరిన ధాన్యాన్ని మరాడిస్తూ బియ్యం అప్పగించారు. క్వింటాల్‌ ధాన్యానికి 67 కి లోలు వంతున ప్రభుత్వా నికి బియ్యం ఇవ్వాలి. ఇలా అప్పగించిన బియ్యానికి సరిపడా ధాన్యాన్ని మాత్ర మే మళ్లీ ప్రభుత్వం ఇచ్చింది. దాంతో కొనుగోళ్లులో జాప్యం జరిగింది. అదే మిల్లర్లు వేసవిలో మరాడిం చకపోతే ధాన్యం కొనుగోళ్లు మరింత కష్టతరమయ్యేది. తప్పంతా ప్రభుత్వం వద్ద ఉంచుకుని మిల్లర్లకే ఇప్పుడు జరిమానాలు విధించడంపై విస్మయం వ్యక్తమ వుతోంది.

Updated Date - 2022-07-06T06:10:14+05:30 IST