ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెరగాలి

Jul 24 2021 @ 01:07AM
ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాల సేకరణ వాహనాన్ని ప్రారంభిస్తున్న నీతూ కుమారి ప్రసాద్‌

 పీసీబీ మెంబర్‌ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్‌

హైదరాబాద్‌ సిటీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): పనికిరాని ఎలకా్ట్రనిక్‌, ఎలక్ట్రికల్‌ ఉపకరణాలను పర్యావరణానికి హాని జరగకుండా నాశనం చేయాలని, దీనిపై అందరికీ అవగాహన కల్పించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మెంబర్‌ సెక్రటరీ నీతూ కుమారిప్రసాద్‌ అన్నారు. ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాల వ్యర్థాల నిర్వహణ కోసం రివర్స్‌ లాజిస్టిక్‌ గ్రూప్‌ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌’లో ఆమె పాల్గొన్నారు. సనత్‌నగర్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాల సేకరణ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఎలకా్ట్రనిక్‌, ఎలక్ట్రికల్‌, ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ, పునర్వినియోగం, విభజన కోసం నగరంలో రెండు కలెక్షన్‌, రెండు డిస్‌మాండిలింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేశామని ఆర్‌ఎల్‌జీ ఇండియా ఎండీ రాధికా కాలియా తెలిపారు. నగరంలో పలు ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాల నిర్వహణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు, వ్యర్థాలను సేకరిస్తామని ఆర్‌ఎల్‌జీ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాలను సేకరిస్తామన్నారు. కార్యక్రమంలో పీసీబీ అధికారులు పాల్గొన్నారు. 


Follow Us on: