రైలు పట్టాలు దాటుతున్న Elephantను కాపాడిన లోకో పైలట్లు...నెటిజన్ల ప్రశంసలు

Published: Sat, 14 May 2022 12:04:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రైలు పట్టాలు దాటుతున్న Elephantను కాపాడిన లోకో పైలట్లు...నెటిజన్ల ప్రశంసలు

కోల్‌కతా(పశ్చిమబెంగాల్): వేగంగా వస్తున్న రైలు ముందు పట్టాలు దాటుతున్న ఓ ఏనుగును చూసి సడన్ బ్రేక్ వేసి దాన్ని కాపాడిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వెలుగుచూసింది.15767 నంబరు గల ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ గుల్మా-సివోక్ రైల్వేస్టేషన్ల మధ్య శుక్రవారం నడుపుతుండగా వారికి పట్టాలు దాటుతున్న ఓ ఏనుగు అకస్మాత్తుగా కనిపించింది. దీంతో రైల్వే లోకో పైలట్లు ఆర్ ఆర్ కుమార్, ఎస్ కుందూలు సడన్ బ్రేక్ వేసి రైలును నిలిపివేశారు. దీంతో ఏనుగు క్షేమంగా పట్టాలు దాటింది.రైలు డ్రైవర్ల చొరవతో ఓ ఏనుగుకు ప్రాణాపాయం తప్పింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను డివిజనల్ రైల్వే మేనేజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

ఏనుగు ప్రాణాలు కాపాడిన లోకో పైలట్ కు నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. గతంలో జల్పాయ్ గుడి జిల్లాలోనూ ఓ లోకో పైలట్ రైలుకు ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఏనుగు ప్రాణాలు కాపాడారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.