ఏనుగు ప్రసవ సమయంలో తోటి ఏనుగులు ఏం చేశాయో తెలిస్తే...

ABN , First Publish Date - 2022-06-30T17:56:41+05:30 IST

అడవిలోని జంతువులు ఎలా జీవిస్తాయనేది అంతో ఇంతో తెలుసు కానీ.. వాటి ప్రసవం.. ఆ సమయంలో వాటికి తోటి జంతువులు తోడుగా ఉంటాయా?

ఏనుగు ప్రసవ సమయంలో తోటి ఏనుగులు ఏం చేశాయో తెలిస్తే...

Visakhapatnam : అడవిలోని జంతువులు ఎలా జీవిస్తాయనేది అంతో ఇంతో తెలుసు కానీ.. వాటి ప్రసవం.. ఆ సమయంలో వాటికి తోటి జంతువులు తోడుగా ఉంటాయా? లేదా? అనేది మాత్రం తెలియదు. తాజాగా ఓ ఘటన చూపరులను విస్మయ పరిచింది. ఒక జంతువు ప్రసవ సమయంలో తోటి జంతువులు ఎంత భరోసాగా నిలుస్తాయో ఈ ఘటన చెబుతుంది. పార్వతీపురం మన్యంలో ఓ ఏనుగు ప్రసవించింది. ఆ సమయంలో ఆరు ఏనుగులు వచ్చి తల్లీపిల్లకు రక్షణగా నిలిచాయి. తల్లీపిల్ల చుట్టూ చేరి ఓ రేంజ్‌లో భద్రతను కల్పించాయి. దీనికి సంబంధించిన వీడియోలను స్థానికులు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలను చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తల్లి, పిల్ల ఏనుగులను మధ్యలో పెట్టి ... చూట్టూ ఆరు ఏనుగులు రక్షణ కవచంగా నిలిచాయి. కొమరాడ మండలం అర్తం సమీపంలోని తోటల్లో గత రెండు రోజుల నుంచి ఏనుగుల గుంపు మకాం వేసింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిపోయే ఏనుగుల గుంపు రెండు రోజులుగా ఒకే చోట ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. ఈ విషయం అటవీశాఖ అధికారుల దృష్టికి  సైతం వెళ్లింది. దీంతో ఒక ఏనుగు చుట్టూ మిగిలిన ఏనుగులు చుట్టూ చేరి రక్షణ వలయంలా మారాయి. ఏనుగు ప్రసవిస్తోందని గుర్తించిన అటవీ శాఖ అధికారులు తెలుసుకొని ఏనుగు ప్రసవిస్తోందని గుర్తించి సమీపంలోకి ప్రజలెవ్వరూ వెళ్లకూడదని హెచ్చరించారు. అయినా సెల్ఫీ రాయుళ్లు ఆగుతారా? కాస్త రదూరంగా ఉండైనా.. చేతిలో ఫోన్ పట్టి సెల్ఫీలు.. వీడియోల మీద వీడియోలు తీస్తున్నారు.

Updated Date - 2022-06-30T17:56:41+05:30 IST