Elephant Viral Video: అనగనగా ఒక ఏనుగు... దానికి పనసపండు తినాలనిపించి... తొండాన్ని పైకెత్తింది.. అందకపోవడంతో...

ABN , First Publish Date - 2022-08-04T15:19:24+05:30 IST

భారీ కాయం కలిగిన జంతువులలో ఏనుగు...

Elephant Viral Video: అనగనగా ఒక ఏనుగు... దానికి పనసపండు తినాలనిపించి... తొండాన్ని పైకెత్తింది.. అందకపోవడంతో...

భారీ కాయం కలిగిన జంతువులలో ఏనుగు ముందువరుసలో ఉంటుంది. సాధారణంగా ఏనుగు శాంత స్వభావం కలిగివుంటుంది. అయితే దానికి కోపం వచ్చినప్పుడు భారీ బీభత్సాన్ని సృష్టిస్తుంది. అయితే ఒక ఏనుగుకు పనసపండు తినాలనిపించింది. దానిని అందుకునేందుకు అది ఏం చేసిందో చూస్తే ఎవరైనా షాకవుతారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 


ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో ఉన్నదాని ప్రకారం ఎత్తుగా ఉన్న పనస చెట్టుపై ఒక పనసపండు వేలాడుతూ ఉంటుంది. దానిని చూసిన ఏనుగు తన తొండంతో దానిని అందుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయినా ఫలితం లేకపోవడంతో ఏనుగు తన పాదాలను చెట్టుపై ఉంచి తొండంతో పనసపండును అందుకుంటుంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ ఫన్నీ వీడియోను లక్షా 82 వేల మందికి పైగా చూశారు. 7,300 మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు. 1,100 వందల రీట్వీట్ చేశారు. ఈ వీడియోను చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. 



Updated Date - 2022-08-04T15:19:24+05:30 IST