సింగరేణి ఓసీపీలో ఏనుగు దంతాలు

ABN , First Publish Date - 2020-07-07T07:31:03+05:30 IST

సింగరేణి ఓసీపీలో ఏనుగు దంతాలు

సింగరేణి ఓసీపీలో ఏనుగు దంతాలు

గోదావరిఖని, జూలై 6: సింగరేణి ఓపెన్‌కాస్టు గనుల్లో ఏనుగు దంతాలు బయటపడ్డాయి. ఆలస్యంగా సోమవారం వెలుగుచూసిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈనెల 1న మేడిపల్లి ఓపెన్‌కాస్టులో 20 మీటర్ల లోతున ఓబీ మట్టి తవ్వకాలు జరుపుతుండగా.. తవ్వకం యంత్రానికి గట్టి పదార్థమొకటి తగిలింది. అదేమిటని పరిశీలించగా.. ఆ ప్రదేశంలో రెండు ఏనుగు దంతాలు బయటపడ్డాయి. దీనిపై ఈ నెల 4న పురావస్తుశాఖకు సమాచారాన్ని అందించారు. ఇప్పటి ఏనుగులకు ఉండే దంతాల కన్నా.. ఇవిఅతిపెద్ద పరిణామంలో ఉండడం ఆశ్చర్యానికి, అనుమానాలకు తావిస్తోంది. ఈ దంతాలు 8అంగుళాల వ్యాసంతో ఉన్నాయి. ఒక దంతం 1.27 మీటర్లు, మరొకటి  1.1మీటర్ల పొడవు ఉన్నాయి. ఇది ఒకే దంతమా? రెండు దంతాలా? విరిగిన దంతాలా? అనేది తేలాల్సి ఉంది. రామగుండం ప్రాంతంలో వందల ఏళ్ల క్రితం ఏనుగులు సంచరించేవా? ఈ దంతాలు ఏ కాలం నాటివి? ఈ భారీ దంతాలున్న ఏనుగుల పరిమాణం ఎంత ఉంటుంది? అనే విషయాలు పురావస్తు నిపుణులు తేల్చనున్నారు. 

Updated Date - 2020-07-07T07:31:03+05:30 IST