అర్హులను పట్టభద్ర ఓటర్లుగా నమోదు చేయించాలి : బీకే

ABN , First Publish Date - 2022-09-26T05:16:39+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీ చదివిన ప్ర తి ఒక్కరినీ పట్టభద్ర ఓటర్లుగా నమోదు చేయించాలని హిందూపు రం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు.

అర్హులను పట్టభద్ర ఓటర్లుగా నమోదు చేయించాలి : బీకే
మాట్లాడుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, వేదికపై పార్థసారథి

రొద్దం, సెప్టెంబరు 25: గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీ చదివిన ప్ర తి ఒక్కరినీ పట్టభద్ర ఓటర్లుగా నమోదు చేయించాలని హిందూపు రం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని ఆర్‌ మరువపల్లిలో బీకే స్వగృహంలో టీ డీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పులివెందుల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా బీకే మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చిలో జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీచేసే టీడీ పీ అభ్యర్ధి భూమిరెడ్డి రామగోపాల్‌ రెడ్డి గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. అక్టోబరు ఒకటి నుండి నవంబరు 7 వరకు ఓటరు ప్రక్రియ అమలులో వుంటుందన్నారు. విరివిగా ఓటరు న మోదు చేయించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమం లో పార్లమెంట్‌ అధికార ప్రతినిధి నరసింహులు, తెలుగు మహిళ అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, పెనుకొండ నియోజకవర్గ అధ్యక్షులు చి న్నప్పయ్య, వెంకట రామిరెడ్డి, కన్వీనర్‌ నరహరి, పెనుకొండ నియోజకవర్గ నాయకులు కురుబ కృష్ణమూర్తి, రాష్ట్ర ఐ-టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పవన, సీఎల్‌ఎ్‌సఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరి కృష్ణ, ఇమామ్‌సాబ్‌, తురకలాపట్నం మాజీ ఎంపీటీసీ నా గేంద్ర, టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు షణ్ముఖ, హరి, సురేష్‌, సాయి కిర ణ్‌, రుద్రప్రసాద్‌ పాల్గొన్నారు. 


మేధావుల ఓటుతోనే రాక్షస పాలన అంతానికి నాంది

సోమందేపల్లి: మేధావుల ఓటుతోనే రాష్ట్రంలోని వైసీపీ రాక్షస పాలన అంతానికి నాందిపలకాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓ టు వేయాలని హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షులు బీకే పా ర్థసారధి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీకేతో పాటు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌ రెడ్డి మా ట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను జ గన ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన హామీ ఏమైందంటూ ప్రశ్నించా రు. కేవలం వలంటీర్‌ వ్యవస్థ ఏర్పాటుచేసి, ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు. వచ్చే ఎన్నిక లు టీడీపీకి సెమీ ఫైనల్‌ లాంటివని, ప్రతి కార్యకర్త పట్టభద్రులను కలిసి టీడీపీకి ఓటు వేసేలా కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్‌ సిద్దలింగప్ప, నీరు గంటి చంద్రశేఖర్‌, మాగేచెరువు సర్పంచ నరసింహులు, సంజీవరెడ్డి, వెంకటేశులు, నాగమణి, రామకృష్ణ, అశ్వర్థప్ప, సూర్యనారాయణ, సూరి పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-26T05:16:39+05:30 IST