కెనడా ప్రధానిని హిట్లర్‌తో పోల్చిన ఎలాన్ మస్క్

ABN , First Publish Date - 2022-02-18T22:16:23+05:30 IST

కొంత మంది ట్రూడోను జర్మనీ నియంత అడోల్ఫ్ హిట్లర్‌తో పోలుస్తున్నారు. దీనికి హిట్లర్ నొచ్చుకుని తనను ట్రూడోతో పొల్చవద్దని చెప్తున్నట్లుగా ఉన్న మీమ్‌ను మస్క్ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశారు. కెనడాలో కొనసాగుతున్న ‘ఫ్రీడం కాన్వాయ్’ ట్రక్కుల ర్యాలీని కట్టడీ చేయడానికి కెనడా ప్రభుత్వం..

కెనడా ప్రధానిని హిట్లర్‌తో పోల్చిన ఎలాన్ మస్క్

ఒట్టావా: కెనడాలో కొవిడ్-19 వ్యాక్సినేషన్‌ తప్పనిసరిగా వేసుకోవాలన్న నిబంధనకు వ్యతిరేకంగా వేలాది ట్రక్కులతో పెద్ద ఎత్తున నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ తప్పనిసరి నిబంధన తమ స్వేచ్ఛకు హక్కులకు భంగం కలిగిస్తోందని, తమపై బలవంతంగా అమలు చేయాలనుకునే దేనికీ అంగీకరించబోమని కెనడియన్లు నిరసన చేస్తున్నారు. నిరసన కారణంగా రహస్య ప్రదేశంలో కుటుంబంతో సహ తలదాచుకున్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో.. వ్యాక్సినేషన్ విషయంలో ఎంత మాత్రం తగ్గడం లేదు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.


అయితే తాజాగా వచ్చిన ఒక విమర్శ తీవ్ర వివాదానికి దారి తీసింది. కొంత మంది ట్రూడోను జర్మనీ నియంత అడోల్ఫ్ హిట్లర్‌తో పోలుస్తున్నారు. దీనికి హిట్లర్ నొచ్చుకుని తనను ట్రూడోతో పొల్చవద్దని చెప్తున్నట్లుగా ఉన్న మీమ్‌ను మస్క్ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశారు. కెనడాలో కొనసాగుతున్న ‘ఫ్రీడం కాన్వాయ్’ ట్రక్కుల ర్యాలీని కట్టడీ చేయడానికి కెనడా ప్రభుత్వం 34 క్రిప్టో వాలెట్లను విడుదల చేసింది. దీనికి సంబంధించిన న్యూస్‌ను ఒక వార్త సంస్థ ట్వీట్టర్‌లో షేర్ చేసింది. కాగా దీనికి హిట్లర్ మీమ్‌ను మస్క్ షేర్ చేశారు. మీమ్‌లో ‘‘జస్టిన్ ట్రూడోతో నన్ను పోల్చకండి. నా దగ్గర బడ్జెట్ ఉంది’’ అని రాసి ఉంది. విమర్శలు వెల్లువెత్తడంతో తన ట్వీట్‌ను డిలీట్ చేశారు.


ట్రూడోను హిట్లర్‌తో పోల్చడంపై ఎలాన్ మస్క్‌పై నెటిజెన్లు మండిపడుతున్నారు. మస్క్‌ను నాజీ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కెనడా కోసం మస్క్ చేసిందేమీ లేదని, కానీ కెనడా వారిపై విమర్శలు మాత్రం చేస్తారని ఒక నెటిజెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొక నెటిజెన్.. హిట్లర్ సమయంలో రోడ్లపై శవాల కుప్పలను ఒకవైపు కెనడాలో ప్రశాంతమైన రోడ్లను మరొకవైపు చూపిస్తూ.. హిట్లర్‌తో ట్రూడోను పోల్చడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.


మస్క్‌పై నెటిజెన్లు చేస్తున్న ట్రోలింగ్‌లో కొన్ని ట్వీట్లు



















Updated Date - 2022-02-18T22:16:23+05:30 IST