కంగారు వద్దు.. ఇలా చేయండి.. Viral అవుతున్న ఎలాన్ మస్క్ ట్వీట్!

ABN , First Publish Date - 2022-05-01T21:56:06+05:30 IST

ఇలాంటి వారి భయం పోగొట్టేలా, టెస్లా, స్పేఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్(Elon musk) తాజాగా ట్విటర్‌లో ఓ సలహా షేర్ చేశారు.

కంగారు వద్దు.. ఇలా చేయండి.. Viral అవుతున్న ఎలాన్ మస్క్ ట్వీట్!

ఎన్నారై డెస్క్: డబ్బు సంపాదించేందుకు ఉన్న అనేక మార్గాల్లో స్టాక్ మార్కెట్ కూడా ఒకటి. కానీ.. అనేక మంది షేర్లల్లో పెట్టుబడులు పెట్టేందుకు అంతగా ఇష్టపడరు. నష్టభయం ఎక్కువగా ఉంటుందన్న ఆలోచనే ఇందుకు కారణం. అయితే.. ఇలాంటి వారి భయం పోగొట్టేలా.. టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్(Elon musk) తాజాగా ట్విటర్‌లో ఓ సలహా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది. మస్క్ సలహా ప్రకారం.. ఏ సంస్థ ఉత్పత్తులు, సేవలపై మనకు నమ్మకం ఉంటుందో ఆ సంస్థ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలి. కంపెనీ ఉత్పత్తుల పనితీరు సరిగా లేదని భావించిన సందర్భంగా మరో ఆలోచన లేకుండా మన వద్ద ఉన్న షేర్లను అమ్మేయచ్చు. ఇక మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతున్న సమయంలో కంగారు పడొద్దని కూడా మస్క్ మదుపర్లకు సూచించారు. ఈ సలహాలను పాటించిన వారికి దీర్ఘకాలంలో మంచి లాభాలు కళ్లచూస్తారన్నారు. అపరకుబేరుడు మస్క్ ఇచ్చిన ఈ సలహా ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. 


ఇక మస్క్ ఇటీవల ట్విటర్‌ను చేజిక్కించుకుని ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై సర్వత్రా రెండు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్వీటర్‌లో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఎటువంటి అడ్డంకులూ లేకుండా చేస్తానన్న మస్క్‌కు కొందరు మద్దతు పలుకుతున్నారు. ఈ వైఖరి అరాచకానికి దారి తీస్తుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ట్విటర్‌ను లాభాల బాట పట్టిస్తానన్న మస్క్.. తదుపరి ఏం చేస్తారోననే సందేహం ట్విటర్‌ ఉద్యోగుల్లో వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యోగాలు ఉంటాయా లేదా అంటూ కొందరు ఏకంగా సంస్థ సీఈఓ పరాగ్ అగర్వాల్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన అంతర్గత మీటింగ్‌లో ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే.. ట్విటర్ ఉద్యోగుల పట్ల సంస్థ యాజమాన్యం ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తుందని పరాగ్ వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారట.





Updated Date - 2022-05-01T21:56:06+05:30 IST