అడక్కుండానే ఆఫర్ ఇచ్చారు.. పరిశీలిస్తాం.. ఎలాన్ మస్క్ ఆఫర్‌పై ట్విటర్ రిప్లై..

ABN , First Publish Date - 2022-04-15T03:00:35+05:30 IST

ట్విటర్‌లో 100 శాతం వాటాను 43 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తానంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్‌ను పరిశీలిస్తామని ట్విటర్ తాజాగా ప్రకటించింది.

అడక్కుండానే ఆఫర్ ఇచ్చారు.. పరిశీలిస్తాం.. ఎలాన్ మస్క్ ఆఫర్‌పై ట్విటర్ రిప్లై..

ఎన్నారై డెస్క్: ట్విటర్‌లో 100 శాతం వాటాను 43 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తానంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్‌ను పరిశీలిస్తామని ట్విటర్ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం మస్క్‌కు ట్విటర్‌లో 9 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. తొలుత ట్విటర్‌ బోర్డులో మస్క్ చేరనున్నట్టు వార్తలు రాగా.. మస్క్ ఇందుకు  విముఖత వ్యక్తం చేసినట్టు ఇటీవలే ట్విటర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మస్క్ మరో సంచలన ఆఫర్ ఇచ్చారు. అయితే.. ఇదేమీ హెచ్చరిక కాదని అన్న ఆయన.. ట్విటర్‌తో డీల్ కుదరని పక్షంలో సంస్థలో తనకున్న వాటా గురించి పునరాలోచించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. కాగా.. ఇతర షేర్‌హోల్డర్‌లతో చర్చించాకే మస్క్ డీల్ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని ట్విటర్ పేర్కొంది. 

Updated Date - 2022-04-15T03:00:35+05:30 IST