ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాను వణికిస్తున్న అసని తుఫాను

ABN , First Publish Date - 2022-05-11T13:34:55+05:30 IST

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాను అసని తుఫాను వణికిస్తోంది. నిన్న రాత్రంతా తుపాను ప్రభావంతో ఈదురుగాలులు, పలుచోట్ల వర్షాలు కురిసాయి.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాను వణికిస్తున్న అసని తుఫాను

ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాను అసని(Asani) తుఫాను వణికిస్తోంది. నిన్న రాత్రంతా తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు, పలుచోట్ల వర్షాలు కురిసాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో జనం జాగారం చేసిన పరిస్థితి నెలకొంది. బియ్యపు తిప్ప, చినమైనవానిలంక,  పేరుపాలెంల వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. దాదాపు 60 అడుగుల ముందుకు సముద్రం వచ్చింది. చినమైనవానిలంక వద్ద తుపాను షెల్టరు భవనం చుట్టూ సముద్రపు నీరు చేరింది. నరసాపురం వద్ద  వందలాది ఫిషింగ్ బోట్లు తీరానికి చేరుకున్నాయి. ఈదురుగాలులకు, వర్షాలకు పలుచోట్ల పంటలు నేలకొరిగాయి. 

Read more