ఏలూరు కార్పొరేషన్‌ వైసీపీదే

ABN , First Publish Date - 2021-07-26T09:02:18+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది.

ఏలూరు కార్పొరేషన్‌  వైసీపీదే

50 డివిజన్లలో 47 చోట్ల జయకేతనం.. టీడీపీకి 3

ఏలూరు, జూలై 25(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. 47 డివిజన్లకు ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో వైసీపీ 44.. టీడీపీ మూడు స్థానాలు గెలుచుకున్నాయి. మొత్తం 50 డివిజన్లకుగాను మూడింటిలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆ పార్టీ గెలిచిన డివిజన్ల సంఖ్య 47కు చేరింది. 13 చోట్ల నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఇచ్చిన టీడీపీ.. ఐదు స్థానాల్లో రెండంకెల స్వల్ప ఓట్లతో ఓటమి పాలైంది. 15వ డివిజన్లో సీపీఐ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చినా.. చివరకు 83 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వైసీపీ మేయర్‌ అభ్యర్థి నూర్జహాన్‌ 1,495 ఓట్ల మెజారిటీతో 50వ డివిజన్‌ను కైవసం చేసుకున్నారు. జనసేన-బీజేపీ కూటమి ప్రభావం ఎక్కడా కనిపించలేదు. 

Updated Date - 2021-07-26T09:02:18+05:30 IST