చింతమనేనికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే ఎలిజా...

ABN , First Publish Date - 2022-04-26T18:26:47+05:30 IST

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా మండిపడ్డారు.

చింతమనేనికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే ఎలిజా...

ఏలూరు జిల్లా: టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా మండిపడ్డారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించడమే కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి చింతమనేనికి లేదన్నారు. మానిఫెస్టోలో పెట్టిన పథకాలను 95 శాతం నెరవేర్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదేనన్నారు. 2014లో టీడీపీ మానిఫెస్టో.. వైసీపీ మానిఫెస్టోపై బహిరంగ చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా.. చింతమనేనికి సవాల్ విసిరారు.


Updated Date - 2022-04-26T18:26:47+05:30 IST