Eluru జిల్లా: Chintamaneni ఇంటి దగ్గర ఉద్రిక్తత..

ABN , First Publish Date - 2022-06-08T19:36:04+05:30 IST

Eluru జిల్లా: దెందులూరులో భారీగా పోలీసులు మోహరించారు. దుగ్గిరాలలో చింతమనేని...

Eluru జిల్లా: Chintamaneni ఇంటి దగ్గర ఉద్రిక్తత..

Eluru జిల్లా: దెందులూరులో భారీగా పోలీసులు మోహరించారు. దుగ్గిరాలలో చింతమనేని ప్రభాకర్‌ (Chintamaneni Prabhakar)ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో చింతమనేని ఇంటివద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇంటి నుంచి బయటకు వెళుతున్న చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు. బయటకు వెళ్లకూడదని పోలీసులు తేల్చి చెప్పారు. కోర్టు వాయిదాకు వెళ్లాలని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో చింతమనేని, పోలీసుల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. రౌడీ షీటర్స్ వల్ల దెందులూరులో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని చింతమనేని అన్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. అల్లర్లపై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చింతమనేని అన్నారు.

Updated Date - 2022-06-08T19:36:04+05:30 IST